టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించిన ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో కృష్ణ తుదిశ్వాస విడిచారు. విశాఖకు చెందిన ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రెస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ ఆయనే సమకూర్చేవారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. ఆ టైమ్‌లో ఆయన్ను అందరూ ‘సురేష్’ కృష్ణ అనేవారు. ఆ తర్వాత కాస్టూమ్స్ కృష్ణ అనే పేరు స్థిరపడింది. ‘భారత్ బంద్’తో నటుడిగా పరిచయడం అయ్యారాయన. ఆ మూవీకి అయిష్టంగానే ఆయన ఓకే చెప్పారు. కానీ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇష్టంతో నటించి అందర్నీ మెప్పించారు.
‘పెళ్లాం చెబితే వినాలి’, ‘పోలీస్ లాకప్’, ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్లు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపీఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. నిర్మాతగానూ తన అభిరుచికి తగిన చిత్రాలు తీశారు. అయితే ఎంత కష్టపడినా ప్రొడ్యూసర్‌గా లాభాలు రాలేదని ఓ సందర్భంలో ఆయన వాపోయారు. జగపతి బాబు హీరోగా ‘పెళ్లి పందిరి’ని నిర్మించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. అంతకుమందు ‘అరుంధతి’ అనే చిత్రం తీశారు. సూపర్ స్టార్ కృష్ణతో ‘అశ్వత్థామ’ మూవీని ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఇకపోతే, కాస్ట్యూమ్స్ కృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.
Sad to hear about Costumes Krishna Garu’s demise. Condolences to his family members. You will be missed. RIP… pic.twitter.com/m86Zr57Hjt
— Sri Venkateswara Creations (@SVC_official) April 2, 2023