రీమేక్ అని ప్రకటించకుండా.. ఒకే రకమైన కథాంశాలను తెరపైకి తీసుకొస్తే మాత్రం.. ఖచ్చితంగా సినిమాలు కాపీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది.. కొత్తగా విడుదలై సక్సెస్ అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మూవీపై కాపీ ట్రోల్స్ మొదలయ్యాయి.
సాధారణంగా ‘కాపీ’ అనే పదం ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలో వింటుంటాం. కానీ.. ఈ మధ్యకాలంలో కాపీ అనేది ఐటీలో కంటే ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అవును.. మారుతున్న కాలంతో పాటే చిత్రపరిశ్రమలో టెక్నాలజీ కూడా ప్రవేశించింది. అప్పటినుండి ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు, పోస్టర్స్ ఏవి విడుదలైనా.. వాటి మాతృక ఏ భాషలో ఉందో కనిపెట్టిమరీ కాపీ అనేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం మామూలే. కానీ.. రీమేక్ అని ప్రకటించకుండా.. ఒకే రకమైన కథాంశాలను తెరపైకి తీసుకొస్తే మాత్రం.. ఖచ్చితంగా ఆయా సినిమాలు కాపీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఆ విధంగా ఇప్పుడు కొత్తగా విడుదలై సక్సెస్ అందుకున్న ‘రైటర్ పద్మభూషణ్‘ మూవీపై కాపీ ట్రోల్స్ మొదలయ్యాయి. సుహాస్ హీరోగా ‘మేజర్’ మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ డ్రామా.. రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ తో సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. మరోవైపు కలెక్షన్స్ పరంగా లాభాలలో దూసుకుపోతోందీ సినిమా. ఇలాంటి తరుణంలో ఈ సినిమా కథ.. 2017లో హిట్ అయిన బాలీవుడ్ ‘బైరేలి కి బర్ఫీ’ మూవీ లైన్ తో మ్యాచ్ అయ్యిందని.. దాదాపు రెండు సినిమాల కథాంశాలు సేమ్ ఉన్నాయనే కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, కృతిసనన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘బైరేలికి బర్ఫీ’ మూవీ.. “ది ఇంగ్రిడియెంట్స్ ఆఫ్ లవ్” అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా రూపొందింది. హిందీలో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి భార్య అశ్వినీ తివారి తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా దాదాపు రైటర్ పద్మభూషణ్ మాదిరే ఉండటం గమనార్హం. ‘బైరేలికి బర్ఫీ’ అని బుక్ చదివిన హీరోయిన్.. బుక్ పైన రచయిత చిరాగ్ పేరు చూసి కలవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక బుక్ రాసింది చిరాగ్ కాదు ప్రీతమ్ అని వేరే వ్యక్తి రాశాడని తెలుస్తుంది. కానీ.. హీరోయిన్ ముందు ఆ బుక్ రాసింది తానేనని చిరాగ్ నమ్మించే ప్రయత్నం చేస్తాడు.. తర్వాత జరిగే పరిణామాలు ఏంటి?” అనేది బేసిక్ లైన్.
సో.. ఇప్పుడిదే పాయింట్ పై రైటర్ పద్మభూషణ్ మూవీ గురించి చర్చలు మొదలయ్యాయి. బైరేలికి బర్ఫీ మూవీనే అటు ఇటుగా మార్చి.. కాపీ కొట్టేశారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి రైటర్ పద్మభూషణ్ సినిమాని ఈ హిందీ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యారా లేక ఒరిజినల్ నవల నుండి ఇన్స్పైర్ అయ్యారా.. లేక యాదృచ్చికంగా కథాంశాలు కలిశాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రైటర్ పద్మభూషణ్ సినిమాని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఎమోషన్స్ జోడించి సక్సెస్ అందుకున్నారు మేకర్స్. మరి సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న టైమ్ లో ఇలాంటి ట్రోల్స్ రావడం కామన్ ఆడియెన్స్ కి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి ఈ కాపీ ట్రోల్స్ పై మేకర్స్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక రైటర్ పద్మభూషణ్/బైరేలికి బర్ఫీ మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#WriterPadmabhushan సినిమా కథ కాపీ రైట్ వివాదం లో చిక్కుకుంటుందా… ఓ హిందీ సినిమా ను పోలి ఉందా ఈ కథ. ఆ హక్కులు తెలుగు లో ఎవరి దగ్గర ఉన్నాయి.. ?
— devipriya (@sairaaj44) February 9, 2023