పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి విడుదలైన పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్‘. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే.. రిలీజ్ అయ్యాక ప్రతి సినిమాకు జరిగే విషయమే రాధే శ్యామ్ విషయంలో కూడా జరిగింది. ఈ సినిమా పామిస్ట్రీ(హస్తసాముద్రికం) నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో పామిస్ట్ గా కనిపించాడు.
పామిస్ట్రీని లవ్ స్టోరీకి ముడిపెట్టి ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అయితే.. సినిమాలో కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని రిఫరెన్స్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. రాధే శ్యామ్ లో ప్రభాస్ ఒక ట్రైన్ లో వెళుతూ.. ఒకమ్మాయి చేతి రేఖలు చూస్తాడు. ఆ ట్రైన్ మరికొద్దిసేపట్లో ఆక్సిడెంట్ కి గురవుతుందని తెలుసుకొని ఆ ప్రమాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు.ఇదే సన్నివేశం ఇదివరకే ఓ తెలుగు సినిమాలో కనిపించిందని.. ఆ సన్నివేశం ఇదేనంటూ ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. అయితే.. రాధే శ్యామ్ సీన్.. ఆ గతంలోని తెలుగు సీన్ ఒకేలా ఉండటంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. రిఫరెన్స్ అంటే ఓకే.. కానీ ఏకంగా సీన్ అంతా కాపీ చేస్తే ఎలా అంటూ దర్శకుడి పై విమర్శలు గుప్పిస్తున్నారు. 2005లో వచ్చిన ‘రిలాక్స్’ అనే సినిమాలో సీన్ అంటూ కామెంట్స్ లో చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.