RGV: కొద్దికాలంగా దేశ రాజకీయాలలో రాష్ట్రపతి అభ్యర్థుల గురించి నిరంతర చర్చలు జరుగుతున్న విషయం విదితమే. ఈ తరుణంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ముంబై కోర్టులో కేసు నమోదైంది. సుభాష్ రాజోరా అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తనని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో వర్మపై ఈ కేసు వేశారు.
సెక్షన్లు 499, 500 (పరువు నష్టం), 504 (ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపునకు శిక్ష) ప్రకారం సుభాష్ రాజోరా కేసు నమోదు చేసినట్లు ఆయన తరపు న్యాయవాది డీవీ సరోజ్ మీడియాకు తెలిపారు. అంతేగాక సుభాష్ ఫిర్యాదును అక్టోబరు 11న పరిశీలిస్తామని జడ్జి తెలిపినట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ ట్విటర్ ఖాతాలో అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారని సుభాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు రాష్ట్రపతి అభ్యర్థిని, ఆ వర్గ ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా, ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును పోటీకి నియమించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వర్మ చేసిన ట్వీట్ పై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. మరి ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022