యువ హీరోయిన్ అనికా సురేంద్రన్‌పై కొందరు నెటిజన్లు హద్దు మీరి కామెంట్లు చేశారు. ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలపై నీఛంగా మాట్లాడారు. గతంలోనూ ఇలానే ఆమెపై కామెంట్లు చేశారు కొందరు.
సినిమా వాళ్లపై కామెంట్లు చేయటానికి కొంతమంది గోతి కాడి నక్కల్లా కాచుకుని ఉంటారు. సందు దొరికితే చాలు దారుణమైన కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ పేరుతో నానా చెత్త వాగుతూ ఉంటారు. అది కూడా నటీమణులపై ఫోకస్ పెట్టి మరీ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా, ప్రముఖ యువ హీరోయిన్ అనికా సురేంద్రన్ నెటిజన్ల కారణంగా ట్రోలింగ్స్‌కు గురవుతున్నారు. కొంతమంది నెటిజన్లు ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. అనికా కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేశారు.
బ్లూ డ్రెస్‌లో రూములో బెడ్‌పై పడుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఓయో రూములో ఏం చేస్తున్నావు’’.. ‘‘ అడల్ట్ పేజీ రన్ చేసే వాళ్లకు మంచి స్టఫ్ దొరికింది.. పండగే..’’..‘‘ డ్రెస్సు కొంచెం కొంచెం కిందకు జారుతోంది’’..‘‘ ఇవన్నీ లీకైన పిక్స్ లాగా ఉన్నాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అనికా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. ‘బుట్టబొమ్మ’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఇదే ఆమె తొలి తెలుగు సినిమా కావటం విశేషం. ప్రస్తుతం హీరోయిన్‌గా సినిమాలతో బిజీ అయిపోయారు.