ఏ రంగంలోనైనా రాణించాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నవారందరూ కెరీర్ ఆరంభంలో కష్టపడ్డవారే. అయితే.. గొప్ప స్థాయికి రావాలంటే కష్టపడకతప్పదు. కానీ.. ఒక్కో రంగంలో కష్టాలు ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే కష్టాలు వేరు. అలా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుదర్శన్.
ఏ రంగంలోనైనా రాణించాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నవారందరూ కెరీర్ ఆరంభంలో కష్టపడ్డవారే. అయితే.. గొప్ప స్థాయికి రావాలంటే కష్టపడకతప్పదు. కానీ.. ఒక్కో రంగంలో కష్టాలు ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే కష్టాలు వేరు. డైరెక్టర్, నటుడు, టెక్నీషియన్.. ఇలా ఇండస్ట్రీలో ఏదొక కేటగిరిలో సెటిల్ అవ్వాలని.. రోజురోజుకూ ఎంతోమంది మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్ కి వచ్చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకడిగా వచ్చి.. ఎన్నో కష్టాలు పడి.. ఆఖరికి కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుదర్శన్.
కమెడియన్ సుదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువగా మీడియమ్, యంగ్ హీరోల సినిమాలలో కనిపిస్తుంటాడు. అయితే.. నటుడిగా ప్రస్తుతం మంచి అవకాశాలతో దూసుకుపోతున్న సుదర్శన్.. తన కెరీర్ లో పడిన కష్టాలను, అప్పటి పరిస్థితులను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. సుదర్శన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫ్రెండ్స్ తో కలిసి యూసఫ్ గూడలో రూమ్ రెంట్ తీసుకున్నాం. మా రూమ్ ఉన్న బిల్డింగ్ లో నాలుగైదు ఫ్లోర్స్ ఉండేవి. ఒక్కో ఫ్లోర్ లో అగ్గి పెట్టెల్లా చిన్న చిన్నరూమ్స్. ఆ చిన్న రూమ్ లకు ఎటాచ్‌డ్ బాత్రూమ్స్. ఒక్కోసారి బాత్రూమ్ లో నీళ్లు బయటకు వచ్చేవి. లగేజిలో లేపేసి ఉన్న ప్లేస్ లో పడుకునేవాళ్ళం.
కొన్నిసార్లు బాత్రూమ్ లో వాటర్ ఉండేవి కావు. అప్పుడు మేం పొద్దున్నే టైమ్ 10 అయ్యేదాకా వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే.. పక్కనే బిగ్ బజార్ స్టోర్ కి వెళ్లి.. అక్కడి వాష్ రూమ్స్ వాడుకునేవాళ్ళం.” అని చెప్పుకొచ్చాడు. సుదర్శన్ మాటలు వింటేనే ఎంతో బాధగా అనిపిస్తోంది. అలాంటిది.. ప్రెజెంట్ గొప్ప స్థాయిలో ఉన్నవారు, స్టార్స్ గా ఎదిగినవారు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అదీగాక రీసెంట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం.. ఇండస్ట్రీలో తాను పడిన కష్టాలు పగవాడు కూడా పడకూడదని చెప్పారు. అంటే.. చూడండి ఒక్కొక్కరి ఎవరి లైఫ్ లో ఎలాంటి కష్టాలు ఉన్నాయో ఎవరం అంచనా వేయలేం. మరి ఇండస్ట్రీలో ఆర్టిస్టులు పడే కష్టాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.