బుల్లితెర మీద కామెడీ షో అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు. ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే కాక.. ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుంది. ఈ వేదిక మీద తమ టాలెంట్‌ని నిరూపించుకుని.. ఆ తర్వాత సినిమాలో కూడా రాణిస్తున్నావారు ఎందరో ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు లేని కమెడియన్లకు కూడా జబర్దస్త్ మంచి వేదికగా మారింది. అలానే ఈటీవీ ప్లస్‌లో వచ్చిన పటాస్ కార్యక్రమం కూడా ఎందరో కొత్త వారికి జీవితాన్నించింది. ప్రస్తుతం కమెడియన్లుగా రాణిస్తున్న యాదమ్మ రాజు, సద్దాం వంటి వారు.. పటాస్ కార్యక్రమం ద్వారానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పటాస్ షోలో తన పంచులు.. కామెడీ టైమింగ్‌తో అలరించిన సద్దాం.. అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక్కడ తెచ్చుకున్న గుర్తింపు ద్వారా.. వేరే చానెల్స్‌లో కామెడీ షోలలో అవకాశాలు దక్కించుకున్నాడు సద్దాం.
దానిలో భాగంగా అదిరింది కామెడీ షోలో అదిరిపోయే పంచులతో అదరగొట్టాడు. తోటి కమెడియన్ రియాజ్‌తో కలిసి గల్లీ బాయ్స్ టీమ్ ద్వారా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఆ తర్వాత కామెడీ ధమాకా, కామెడీ స్టార్స్ కార్యక్రమాల్లో కూడా తనదైన కామెడీ పంచులతో రచ్చ చేశాడు సద్దాం. జబర్దస్త్‌లో హైపర్ ఆదికి ఏ మాత్రం తీసిపోని విధంగా సద్దాం పంచులు ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం.. సద్దాం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. అది కూడా టీమ్ లీడర్‌గా అంటూ జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా డిసెంబర్ 22న ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. సద్దాం న్యూటీమ్ లీడర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ సద్దాం, యాదమ్మ రాజు, షైనింగ్ శాంతికుమార్‌లతో కలిసి స్కిట్స్ చేయనున్నాడు సద్దాం. ఎంట్రీ ఇవ్వడంతోటే.. తనదైన పంచులతో నవ్వులు పంచాడు సద్దాం. తర్వాత స్కిట్‌లో తాను చానెల్స్ మారడంపై తన మీద తానే పంచులు వేసుకున్నాడు సద్దాం. జబర్దస్త్ తన హోమ్ గ్రౌండ్ కాబట్టి.. అందుకే తిరిగి తిరిగి ఇక్కడకే వచ్చానని చెప్పాడు. ఇక ఈ ఎపిసోడ్‌కు పోసాని కృష్ణమురళి, ఇంద్రజ జడ్జ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది. ఇక సద్దాం.. తిరిగి జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సద్దాం రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.