అనేక సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉంటూ నవ్వులు పూచించే కామెడీ రౌడీ రఘు చాలామందికి సూపరిచితమే. చాలా కాలంగా రఘు సినిమాల్లో కనిపించడంలేదు. తాజాగా వైన్‌షాప్ నడిపిస్తూ ప్రత్యక్షమయ్యాడు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌లో రెండు వైన్‌షాప్‌లను రఘు నిర్వహిస్తున్నాడు. వైన్‌షాప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో రెండు దుకాణాలను దక్కించుకున్నట్లు సమాచారం. అభినవ్ 1, అభినవ్ 2 పేరిట రెండు వైన్‌షాప్‌లను రఘు ఏర్పాటు చేశాడు.
గతంలో వెండితెరపై నటుడిగా ప్రేక్షకులను అలరించిన నటుడు ఇప్పుడు ఇలా వైన్‌షాప్‌లో మద్యం విక్రయిస్తున్నాడు. మద్యం విక్రయించి డబ్బులు లెక్కపెడుతున్న రఘు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రఘు జబర్ధ్‌స్త్ కామెడీ షోలో కూడా చేశాడు. ప్రారంభంలో టీమ్ లీడర్‌గా ఉండి కామెడీ స్కీట్‌లు చేశాడు. అనంతరం షో నుంచి బయటికొచ్చి సినిమాల్లో వేశాలు వేశాడు. మరి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఇలా వైన్‌షాప్‌లను నిర్వహిస్తున్నాడు.
— Sayyad Nag Pasha (@PashaNag) December 1, 2021