కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ దొరికింది. అయితే, కిడ్నీ మార్పిడికి సంబంధించి ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుందని ప్రసాద్ భార్య సునీత తెలిపింది.
జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రసాద్ గత రెండేళ్లుగా కిడ్నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కిడ్నీ దొరికింది. అయితే, కిడ్నీ మార్పిడి చేయటానికి ముందు ప్రసాద్‌కు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుందని ప్రసాద్ భార్య సునీత తెలిపింది. ఈ మేరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ తమ యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో పెట్టింది. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ.. ‘‘ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది.
రెండేళ్ల క్రితం కిడ్నీ కోసం అప్లై చేశాం. ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. మాకు అక్కడినుంచి కాల్స్ వచ్చాయంట. కాల్స్ మాకు కలవకపోవటమే.. కమ్యూనికేషన్ సరిగా లేకపోవటమో జరిగింది. వచ్చిన ఛాన్స్‌లను మిస్ చేసుకున్నాం. మేము రెగ్యులర్‌గా నాగేశ్వరరెడ్డి సార్‌తో చూపించుకుంటాం. చాలా మంది డయాలసిస్ వల్లే ఇన్‌ఫెక్షన్ వస్తోందని అంటున్నారు. థైరాయిడ్ కూడా ఎక్కువవుతోందని అంటున్నారు. కిడ్నీలు చేసే పని డయాలసిస్ చేస్తుంది కాబట్టి.. సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ మార్పించుకుంటే ఈ సమస్యలు ఉండవని భావిస్తున్నాను. ఇన్ని రోజులు చేయించుకోవాలా? వద్దా? అని ఆలోచన ఉండేది.
కానీ, ఇప్పుడు చేయించుకోవాలని డిసైడ్ అయ్యాం. ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాం. ప్రతీ ఆస్పత్రిలో మాకు సపోర్టుగానే ఉన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు చాలా టెస్టులు చేస్తారు. నేను కిడ్నీ ఇద్దామని అనుకున్నాను. కానీ, డాక్టర్లు ప్రసాద్‌ది చిన్న వయసు కాబట్టి.. ముందు బయట డోనర్లను వెతుకుదాం అన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ అయితే.. ఓ పది, ఇరవై ఏళ్లు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఏదైనా సమస్య వస్తే.. అప్పుడు నేను ఇచ్చేలాగా డాక్టర్లు ప్లాన్ చేశారు. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు ప్రసాద్‌కు కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. అవన్నీ ఒకే అనుకున్న తర్వాతే కిడ్నీ మార్పిడి జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు.