పెళ్లి పీటలు ఎక్కబోతున్న విజిల్ సినిమా లేడీ కమెడియన్..ఫోటోస్ వైరల్

గుండమ్మ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె పెళ్ళికి సిద్ధమైంది.

తమిళ నాట విజయవంతమైన విజయ్ “బిగిల్” సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో రిలీజై ఇక్కడ కూడా మంచి స్పందన రాబట్టింది. ఇక ఈ సినిమాలో గుండమ్మగా నటించిన ఇంద్రజ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇంద్రజ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ తమిళ హీరో విజయ్ నటించిన విజిల్ సినిమాలో గుండమ్మ పాత్రలో నటించిన కమెడియన్ అంటే చాలు.. ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఇంద్రజ.

ఇదిలా తాజాగా ఇంద్రజ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో కాబోయే భర్తతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కూడా ఉంది. అలా అందరు కలిసి ఏదో దేవాలయానికి వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇంద్రజ కు కాబోయే భర్త మరెవరో కాదు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఇంద్రజ తరచూగా రీల్స్ చేస్తూ వచ్చింది. అయినప్పటికి అతనితోనే ఏడడుగులు వేయనున్నట్లు కూడా చెప్పింది. అలా తెలపగానే వెంటనే నెటిజన్లు ఫోటోలు చూసి మీరు అప్పుడే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించగా.. వెంటనే ఇంద్రజ స్పందిస్తూ.. లేదండి ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టలేదని.. ఆ పని పూర్తి అవగానే త్వరలోనే పెళ్లి డేట్ చెప్తాను అని తెలిపింది.

అయితే ఇంద్రజ తమిళంలో విజయ్ మూవి బిగిల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల అయ్యింది. ఈ విజిల్ సినిమాలో పుట్బాల్ పాండియమ్మగా నటించి తన చేసిన కామేడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆమె ఎప్పుడు ఆ సినిమాలో తింటూ ఉండడంతో విజయ్ ఇంద్రజ ను ఆటపట్టించే వాడు. ఆ తర్వాత ఆమె ను సర్వైవర్ అనే షో లో పాల్గొంది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె కార్తీ విరుమాన్ సహాపలు అనే మూవీ లతో బిజీగా ఉంది. ఆమె తండ్రి రోబో శంకర్ మాత్రం కళక్కపోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో ఒక మెరుపు మెరిసాడు. ఇదర్కు తానే ఆశైపట్ట్తె బాలకుమార, వేలైను వందత వేళ్ల్తకారన్, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలపై వెండితెరపైనా సందడి చేసాడు. మొత్తానికి పెళ్ళికి సిద్ధమైన ఇంద్రజ.. ఇకముందు సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed