బాలీవుడ్ బుల్లితెరపై తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వించే భారతీ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది. కాకపోతే ఆమె ఈ వ్యాఖ్యలు గతంలో చేసినప్పటికీ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-ఎ కింద పంజాబ్ లోని అమృత్ సర్ లో భారతీ సింగ్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైంది.
భారతీ సింగ్ బహికంగ క్షమాపణ చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారతీ సింగ్ వ్యాఖ్యలపై సిక్కు కమ్యూనిటీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎస్ జీపిసి అధికార ప్రతినిధి తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. హాస్యనటి భారతీ సింగ్.. సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదానికి కారణం ఏంటంటే?
బాలీవుడ్ బుల్లితెరపై పలు షోల్లో హూస్ట్ గా వ్యవహరించారు భారతీ సింగ్. ఇటీవల కామెడీ షోలో టీవీ నటి జాస్మిన్ భాసిన్ అతిథిగా కనిపించింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ.. గడ్డం, మీసాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు గడ్డం.. మీసాలు ఉన్నవారు తమ జీవితాన్ని అలాగానే గడిపేస్తుంటారని చమత్కరించింది. భారతీ చేసిన వ్యాఖ్యలు సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని వ్యతిరేకత వచ్చింది.
బహిరంగ క్షమాపణలు :
తాను ఏ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని.. తన కామెడీ డైలాగ్స్ తో నవ్విచడానికి ప్రయత్నిస్తుంటానని.. ఏ మత మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదంటూ భారతీ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియో రిలీజ్ చేసింది. గత కొన్ని రోజులుగా తనపై లేని పోని దుష్ప్రచారం జరుగుతుందని.. ఏ పంజాబీని ఎగతాళి చేయలేదు. నేను నా ఫ్రెండ్ తో సరదాగా కామెడీ చేశాను అంతే. తన వ్యాఖ్యలు ఒకవేళ బాధకు గురి చేసి ఉంటే వారికి రెండు చేతులు ఎత్తి క్షమాపణలు వేడుకుంటున్నాను. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.