టాలీవుడ్‌లో నటుడిగా, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలీ. ఆలీ సినిమాలు, టీవీ షోల ద్వారా అలరిస్తుండగా, ఆయన సతీమణి జుబేదా ఆలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. హోమ్ టూర్ వీడియోలు, వంటల వీడియోలు, పండగలప్పుడు స్పెషల్ వీడియోలు ఇలా రకరకాల వ్లాగ్ వీడియోలతో ఆమె తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈమె యూట్యూబ్ ఛానల్‌కి 5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈమె పెట్టిన ప్రతీ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఈ క్రమంలోనే ఆమె తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించి షాపింగ్ వీడియోలని అప్‌లోడ్ చేశారు. నిశ్చితార్థానికి కావాల్సిన బంగారు ఆభరణాలు, చీరలు వంటి షాపింగ్ వీడియోలను ఆమె ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆ వీడియోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఆలీ కూతురు నిశ్చితార్థ వేడుకలను చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకి తగ్గట్టే ఆలీ సతీమణి తన కూతురి ఎంగేజ్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఆలీ, జుబేదా ఆలీ దంపతుల కూతురు నిశ్చితార్ధ వేడుకలు ఒక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. పెళ్లి ఈ వేడుకకు ఆలీ బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. హాస్యనటుడు బ్రహ్మానందం, సాయికుమార్, సురేఖ దంపతులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అథిధుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
బంధువులు, అతిధుల సమక్షంలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకుని నిఖా ఖాయం చేసుకున్నారు. వేడుకలో పాల్గొన్న బంధువులు ఆట, పాటలతో, డ్యాన్సులతో అలరించారు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా ఉందంటే ఇక పెళ్లి ఎంత ఘనంగా చేస్తారో అనేంత కోలాహలంగా ఉంది. నిశ్చితార్ధ వేడుకలను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకను షూట్ చేసి ఆలీ సతీమణి తన “జుబేదా ఆలీ” ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ నిశ్చితార్ధ వీడియోపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.