తెలుగు ఇండస్ట్రీలో సీతాకోక చిలుక చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ తర్వాత స్టార్ కమెడియన్ గా మారారు. నటుడిగా ఎన్నో అవార్డులు.. రివార్డులు అందుకున్న ఆలీ ప్రస్తుతం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. స్టార్ కమెడియన్‌గా వేయికి పైగా సినిమాల్లో నటించి నవ్వించారు ఆలీ, కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సినిమాలు చేసి మెప్పించారు. తాజాగా నటుడు ఆలీకి మరో ఘనత దక్కింది. ఆలీకి కె.ఎల్.యు. యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. కె.ఎల్.యు. యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉంది అన్నారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇప్పటి వరకు 5 భాషల్లో 1124 సినిమాల్లో నటించానని.. తనను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సీఎం జగన్ మంత్రి పదవిని ఇస్తే మరింత సంతోషమని ఆలీ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని.. హామీ కూడా ఇచ్చారన్నారు.
ప్రస్తుతం సినిమా రంగానికి సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్లు విధానం, బెనెఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు ఆలీ. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా అద్భుతం. అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చారు అని ప్రసంశించారు.