68వ జాతీయ సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపికైంది. అమృతా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మించగా.. అంగిరేకుల సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
ప్రేమకు మనసే ముఖ్యం గానీ, అందం, రంగు, హోదా, డబ్బు కాదంటూ చెప్పిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లీడ్ రోల్ లో సుహాస్ ఎంతో న్యాచురల్ గా నటించి మెప్పించాడు. తొలిసారి ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ లో సునీల్ ఆకట్టుకున్నాడు. చాందినీ చౌదరి కూడా తన క్యూట్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథలో విషయం ఉంటే ఎంత చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ కాగలదని ఈ సినిమా నిరూపించింది.
ఇప్పుడు జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డు పొందడంతో ఆ విషయం దేశవ్యాప్తంగా నిరూపితమైందనే చెప్పాలి. అంతేకాకుండా కథ, కథనం ఉంటే చిన్న సినిమాలు కూడా జాతీయ స్థాయిలో సత్తాచాటగలవని మరోసారి రుజువైంది. కలర్ ఫొటో చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#ColourPhoto wins the best Telugu film at #NationalFilmAwards 😀❤️ Congrats @SandeepRaaaj, @sairazesh @iChandiniC and #Suhas pic.twitter.com/Qo6qg2t96A
— Kandula Dileep (@TheLeapKandula) July 22, 2022