తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న సైడ్ పాత్రల్లో నటించి అనూహ్యంగా హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కామెడీ పాత్రల్లో నటించి తర్వాత హీరోలుగా ఆలీ, సునీల్, బ్రహ్మానందం, వేణు మాధవ్ ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే హీరోలుగా నటించినా.. తర్వాత కామెడీ పాత్రలతో మెప్పిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్ హీరోగా నటించిన కలర్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
చిరంజీవి ముఖ్య అతిథిగా `మిషన్ ఇంపాజిబుల్` ప్రీ రిలీజ్ వేడుక విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సుహాన్ చాలా అద్భుతంగా నటించాడని అన్నారు. అతని నటన చూసి తాను ఎంతగానో సంతోషించానని.. ఇతనిలో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడా అనిపించిందని అన్నారు. ఇక బ్లిక్ వేదిక ఫై తన గురించి గొప్పగా చిరంజీవి చెపుతుండడం తో స్టేజ్ పైనే కంటతడి పెట్టుకున్నాడు సుహాస్.
`మిషన్ ఇంపాజిబుల్` మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 01 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.