తరచుగా దేశ రాజకీయాలపై స్పందించే నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన బీజేపీ వ్యతిరేకి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉంటారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవారిని.. పొగిడేవారిని కూడా విడిచిపెట్టరు. వారిపై కూడా కామెంట్లు చేస్తుంటారు. గతంలో ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘2014లో పవన్.. మోదీకి మద్దతు తెలిపాడు. ఆ తర్వాత విమర్శించాడు. ఇప్పుడు మళ్లీ ఆయనకు జై కొడుతున్నాడు. అసలు ఏపీలో బీజేపీకి ఓట్లు వస్తాయా. ఒక శాతం ఓట్లు సాధించే వాళ్లు ఎక్కడ? పవన్ ఎక్కడ?
పోయి పోయి వాళ్లతో పొత్తు పెట్టుకుంటాడా? ఒక పార్టీ అధినేత అయి ఉండి వేరే పార్టీ పంచన చేరుతాడా?’’ అని పవన్‌పై ప్రకాశ్ మండిపడ్డారు. పవన్‌ను ఊసరవెల్లి అని కూడా అన్నారు. ఈ గొడవ జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది. గొడవ కూడా సద్ధుమణిగింది. అయితే, ప్రకాశ్ రాజ్ తాజాగా హీరో విశాల్‌పై విమర్శలు చేశారు. మోదీపై ప్రశంసలు కురిపించినందుకు గానూ ప్రకాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం హీరో విశాల్ కాశీ వెళ్లారు. అక్కడ దేవుడి దర్శనం చేసుకుని, పుణ్య నదిలో స్నానం చేశారు. అనంతరం అక్టోబర్ 31న తన ట్విటర్ వేదికగా దీనిపై స్పందించారు. ‘‘ గౌవరనీయులైన మోదీ గారు.. నేను కాశీ వెళ్లాను. దర్శనం బాగా జరిగింది. పవిత్ర గంగా జలంలో స్నానం కూడా చేశాను.
మీరు గుడిని అద్భుతంగా తీర్చిదిద్దారు. గుడిని మరింత అందంగా మార్చేశారు. ఇందుకు మీకు ఆ దేవుడు ఆశీర్వధిస్తాడు. ఎవరైనా సులభంగా కాశీకి వెళ్లి రావచ్చు. హ్యాట్సాఫ్, సెల్యూట్ యూ..’’ అని పేర్కొన్నారు. ఈ ట్విటర్ పోస్ట్‌పై గురువారం ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆయన కూడా ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ షాట్ ఓకే.. నెక్ట్స్???’’ అని అన్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. విశాల్‌తో ఉన్న చనువుతో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక సీరియస్‌గానే అన్నారా? అన్నది తెలియట్లేదు. అయితే, ఇద్దరి మధ్యా కోల్డ్‌వార్ నడుస్తోందన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది.
Shot Ok…. Next ??? … #justasking https://t.co/uybmBFVSwZ
— Prakash Raj (@prakashraaj) November 3, 2022