విలక్షణ నటుడు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా‘. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కోబ్రా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఇక స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ నుండి దాదాపు మూడేళ్ళ తర్వాత సినిమా వచ్చేసరికి.. కోబ్రా మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లడం విశేషం.
ఇక హీరో విక్రమ్ కెరీర్ లోనే కోబ్రా మూవీ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది తమిళంలో హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిన టాప్ 5 సినిమాలలో కోబ్రా నిలిచింది. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో అద్భుతమైన నటనతో పాటు క్యారెక్టర్స్ వేరియేషన్స్ కూడా ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేశాయి. అయితే.. మాస్టర్ ఫేమ్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన కోబ్రా మూవీ.. మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నయో చూద్దాం!
తెలుగు రాష్ట్రాలలో కోబ్రా ఫస్ట్ డే కలెక్షన్స్:
ఏపీ – తెలంగాణ: 3.75 కోట్ల గ్రాస్(2.28 కోట్లు షేర్)
ఇక ప్రపంచవ్యాప్తంగా కోబ్రా కలెక్షన్స్ చూసినట్లయితే..
మొత్తం: 24.45 కోట్లు (12.60 కోట్లు షేర్)
ఇక ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన కోబ్రా మూవీ తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని మొదటిరోజే సగం పూర్తి చేసింది. ఏపీ, తెలంగాణలో కోబ్రా రూ. 4.5 కోట్ల బిజినెస్ జరుపగా.. బ్రేక్ ఈవెన్ ని రూ. 5 కోట్లుగా సెట్ చేశారు. అయితే.. ఫస్ట్ డే కోబ్రా 2.28 కోట్ల షేర్ రాబట్టింది. ఇదిలా ఉండగా.. డివైడెడ్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ కోబ్రా రూ. 24.45 కోట్లు గ్రాస్ రాబట్టినట్లు సినీవర్గాల సమాచారం. మరి కోబ్రా మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.