బాలీవుడ్ సినిమాలకి, బాలీవుడ్ స్టార్ హీరోలకి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ప్రస్తుతం బాలీవుడ్ సౌత్ సినిమాల డామినేషన్‌ని తట్టుకోలేకపోతుంది. ఇంత ఇరుకులో కూడా తమ సినిమాలని ఆడించాలని స్టార్ హీరోలు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమాను బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో కూడా బాగా ప్రమోట్ చేసి ఆడించాలని చూశారు. అయితే ఆమిర్ ఖాన్ గతంలో నోటి దురదతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన సినిమాని బ్యాన్ చేసే స్థాయికి తీసుకొచ్చాయి. అంతేనా ఆయనకి సపోర్ట్ చేస్తున్న వారి సినిమాలని కూడా బ్యాన్ చేయండిరా అనే స్థాయికి వచ్చింది ఆమిర్ వ్యతిరేక వర్గం. ఇక చేసేదేమీ లేక గతంలో దేశం మీద చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ సినిమా అయితే ఆడలేదు. కారణం సినిమా అంతగా బాలేదన్న విమర్శలు వెలువెత్తాయి. ఎన్ని విమర్శలొచ్చినా పెట్టిన పెట్టుబడి రాబట్టడం కోసం ఆమిర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రమోషన్‌లో భాగంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అసోం రాష్ట్రానికి వెళ్దామని అనుకున్నారు. అయితే ఆమిర్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆమిర్ అసోం పర్యటన విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ కోసమైతే పర్యటనను వాయిదా వేసుకోవాలని హిమంత్ బిశ్వ కోరారు.
ఎందుకంటే ఈ నెల 13 నుండి 15 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. 75 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో స్పూర్తిదాయకమని.. ఆ స్పూర్తి దెబ్బతినకూడదనే పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరినట్లు హిమంత్ బిశ్వ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత ఎప్పుడొచ్చినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 14న గువాహటికి వెళ్దామనుకున్నారు ఆమిర్. ఈ విషయమై అసోం సీఎంతో కూడా మాట్లాడారు. అయితే ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం కోసం ఆమిర్‌ను అసోం రావద్దని హిమంత్ బిశ్వ కోరారు. మరి దేశం కోసం ఆమిర్ అసోం పర్యటనను వాయిదా వేసుకోమన్న హిమంత్ బిశ్వపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.