గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితి గురించి సీఎం జగన్ వాకబు చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కైకాల కుమారుడు రామారావుకు ఫోన్ చేసి కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు .కైకాల ఆరోగ్యంకు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్న ప్రభుత్వం తరఫున సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు.
అదే విధంగా మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కన్నడ హీరో యాశ్ కైకాల కుమారుడికి ఫోన్ చేసి కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుకున్నాడు. కైకాలకు ఏమీ కాదని, ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆయనకు ధైర్యంగా తామంతా ఉన్నామని సినీ ప్రముఖుల చెప్పారు. మరోవైపు కైకాల కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించ వద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.