తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరాది వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. పండుగ వాతావరణంలో జనాలంతా ఎంతో ఆనందంగా ఉగాది పచ్చడి చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని.. 'సరిగమప లిటిల్ ఛాంప్స్' విన్నర్ సాయి వేద వాగ్దేవికి మర్చిపోలేని అనుభూతిని అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరాది వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. పండుగ వాతావరణంలో జనాలంతా ఎంతో ఆనందంగా ఉగాది పచ్చడి చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ ముగియడంతో.. కొత్తగా ‘శోభకృత్’ నామ సంవత్సరాది మొదలైంది. అయితే.. ఉగాది అనేది అందరికీ పండుగే. అందరికీ స్పెషలే. కానీ.. కొందరికి మాత్రమే మరింత స్పెషల్ అవుతుంది. అలా ఈ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని.. ‘సరిగమప లిటిల్ ఛాంప్స్’ విన్నర్ సాయి వేద వాగ్దేవికి మర్చిపోలేని అనుభూతిని అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
అతి చిన్న వయసులోనే సరిగమప లిటిల్ ఛాంప్స్ విన్నర్ గా నిలిచిన సాయి వేద వాగ్దేవి.. 2019లో హిస్టరీ క్రియేట్ చేసింది. అప్పటినుండి వాగ్దేవి పేరు అన్నీ మేజర్ సింగింగ్ కంపిటిషన్స్ లో వినబడుతూనే ఉంది. ఇక 2023 ఉగాది సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించిన ఏపీ ఉగాది సెలబ్రేషన్స్ లో భాగంగా సింగర్ సాయి వేద వాగ్దేవిని సీఎం జగన్ సత్కరించి ఆశీర్వదించారు. ప్రస్తుతం వాగ్దేవిని సీఎం జగన్ సత్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. వాగ్దేవికి తోడుగా స్టేజ్ పైకి తల్లి శాంతమ్మ కూడా వెళ్లడం విశేషం. సింగర్ వాగ్దేవి సోదరుడు సాయి దేవ హర్ష.. 2007లో సరిగమప లిటిల్ ఛాంప్స్ టైటిల్ విజేతగా నిలిచాడు.
ఇదిలా ఉండగా.. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన వాగ్దేవి.. తల్లి శాంతమ్మ వద్దే సింగింగ్ లో ఓనమాలు నేర్చుకుంది. 6 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఏకంగా సరిగమప లిటిల్ ఛాంప్స్ విజేతగా నిలిచింది. ఇంకేముంది.. ఇప్పటిదాకా ఈ షోలో విజేతగా నిలిచిన అతి చిన్న వయసు కంటెస్టెంట్స్ లో వాగ్దేవి స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు సీఎం జగన్ చేతుల మీదుగా సత్కారం పొందేసరికి.. వాగ్దేవి తల్లి శాంతమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ ఇద్దరు పిల్లలు సాయి దేవ హర్ష, సాయి వేద వాగ్దేవి సింగర్స్ గా చిన్నవయసులోనే గర్వపడేలా చేశారు. ప్రెజెంట్ వాగ్దేవి సినిమా పాటలు కూడా పాడుతుండటం విశేషం. మరి సరిగమప లిటిల్ ఛాంప్స్ విన్నర్ వాగ్దేవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.