సుకుమార్– దేవీశ్రీ మధ్య గొడవలు, సుకుమార్- దేవీశ్రీ మధ్య చెడింది, సుకుమార్- దేవీశ్రీ మధ్య మనస్పర్థలు.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్ అంటూ వార్తలు, ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఆ వార్తల్లో అస్సలు నిజం లేదు. వీళ్లేంటి ఇంత కచ్చితంగా చెబుతున్నారు అనుకుంటున్నారా? మా SumanTV.com స్వయంగా దేవీశ్రీతో ఇదే విషయంపై చర్చించి క్లారిటీ తీసుకుంది. అయితే అసలు ఆ ప్రచారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సుకుమార్ రైటింగ్స్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాని పట్టాలెక్కించారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ డైరెక్టర్‌గా ఆ మూవీకి తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ముందు దేవీశ్రీ పేరే అనుకున్నారు. కానీ, తర్వాత డీఎస్పీ స్థానంలో అంజనీష్ పేరును ప్రకటించారు.
అక్కడే అసలు రచ్చ మొదలైంది. సుకుమార్‌కు డీఎస్పీకి రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్థలు వచ్చాయని చెబుతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ రూ.4 కోట్లు కోరగా.. సుకుమార్ మాత్రం ఆ పారితోషకాన్ని రూ.2 కోట్లకు తగ్గించుకోవాల్సిందిగా కోరాడంట. అందుకు డీఎస్పీ నిరాకరించడం వల్లే సుకుమార్ స్వయంగా డీఎస్పీని సినిమా నుంచి తప్పించాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. సినిమాని తక్కవ బడ్జెట్ ముగించాలని భావించారని.. అందుకే అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేక దేవీశ్రీని సినిమా నుంచి తప్పించారంటూ గాసిప్స్ ప్రచారం చేశారు. అయితే ఈ గాసిప్స్ ఏ మాత్రం నిజం లేదు. సుకుమార్- దేవీశ్రీ మధ్య మనస్పర్ధలు అనేవి అవాస్తవం.
ఆర్య సినిమా నుంచి సుకుమార్- దేవీశ్రీ ఎంతో క్లోజ్ ఉంటూ వచ్చారు. వాళ్లిద్దరిదీ విడదీయలేని బంధంగా చెబుతుంటారు. సుకుమార్- దేవీశ్రీ ఇద్దరూ వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటే అని టాలీవుడ్‌లో ఎంతో మందికి తెలుసు. సుకుమార్ కూడా స్వయంగా దేవీశ్రీ గురించి మాట్లాడుతూ.. నేను శరీరం అయితే దేవీశ్రీ నా ఆత్మ అని చెప్పాడు. సుకుమార్ సినిమాల్లో, అతని శిష్యుల సినిమాల్లో కూడా దేవీశ్రీనే సంగీతం అందిస్తుంటాడు. అసలు సుకుమార్ సినిమా అంటే డీఎస్పీ ప్రాణం పెడతాడు. అలాంటి సుకుమార్- దేవీశ్రీ మధ్య గ్యాప్ వచ్చిందంటూ వస్తున్న గాసిప్స్ చూసి వాళ్లు కూడా కాసేపు సరదాగా నవ్వుకున్నారు. అయితే వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదు. వారి స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని.. SumanTV.com ద్వారా మరోసారి స్ట్రాంగ్ గా చెప్పారు.