Vikram: సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చియాన్ విక్రమ్. విభిన్నమైన పాత్రలతో, నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారాయన. ఇతర హీరో ఫ్యాన్స్‌లో కూడా చియాన్ విక్రమ్ నటనను ప్రేమించేవాళ్లు ఉన్నారు. ఇక, విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నటించింది. ‘కోబ్రా’ విడుదల నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది.
తాజాగా, విక్రమ్, శ్రీనిధి శెట్టి, అజయ్ ఇతర సినిమా టీం ప్రమోషన్స్ కోసం తిరుచ్చి వెళ్లింది. విక్రమ్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. స్వాగతం పలకడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా అక్కడకు చేరుకున్న అభిమానుల్ని కంట్రోల్ చేయటం సీఐఎస్‌ఎఫ్ పోలీసుల వల్ల కాలేదు. కంట్రోల్ చేసే నేపథ్యంలోనే వారిపై దాడికి దిగారు. వారిని తరిమికొట్టసాగారు. ఓ పోలీసు మరింత రెచ్చిపోయి విక్రమ్ అభిమానుల్ని కాలితో తంతూ తరిమికొట్టాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు సీఐఎస్‌ఎఫ్ పోలీస్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన నటుడ్ని చూడటానికి వచ్చిన వారితో అంత దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడుతున్నారు. సదరు పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
விக்ரமை காண ஆசையாய் வந்த ரசிகர்களை காலால் எட்டி உதைத்த காவலர்கள்.. வெளியான திடுக்கிடும் வீடியோ! #Cobra #Vikram #Fans #Issue #Police pic.twitter.com/TKE90iAfwN
— Polimer News (@polimernews) August 23, 2022
Thank you Trichy for soaking us in love. #CobraTour #CobraTrichy #CobraFromAug31 @AjayGnanamuthu @arrahman @7screenstudio @SrinidhiShetty7 @mirnaliniravi @MeenakshiGovin2 ThanQ @studios_macro for the lovely edit. pic.twitter.com/lm9Ug2mxRm
— Chiyaan Vikram (@chiyaan) August 23, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో గాజువాక లేడీ కండక్టర్ మాస్ డ్యాన్స్..!