టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు.. టాలెంట్ తో పాటు కసి, హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ఎంతోమంది ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో రాణించాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నటనలో అయినా.. వేరే ఏ టెక్నికల్ వేలో రిఫరెన్స్ లనేవి వర్కౌట్ అవుతాయేమో. కానీ, డాన్స్ కొరియోగ్రఫీ విషయంలో టాలెంట్ తో పాటు అన్ని సొంతంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. అలా టాలీవుడ్ లో మొదటి స్టెప్ నుండి ఎదుగుతూ వచ్చిన కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన గురించి ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు.
శేఖర్ మాస్టర్ జర్నీని ఫస్ట్ నుండి ప్రేక్షకులు చూస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ గా ఎక్కువగా వినిపించే పేరు శేఖర్ మాస్టర్. చిన్న నుండి పెద్ద హీరోల వరకు అందరికి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ నుండి.. మెగాస్టార్, నటసింహం లాంటి సీనియర్ హీరోలవరకు వరుసగా దుమ్ములేపుతున్నాడు శేఖర్ మాస్టర్. అయితే.. ఈయన కొరియోగ్రఫీ అందించిన రెండు పెద్ద సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలు కూడా ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తుండటం విశేషం. పైగా రెండింట్లోను హీరోయిన్ శృతిహాసనే. ఈ క్రమంలో తాజాగా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల గురించి మాట్లాడిన శేఖర్ మాస్టర్.. ఈ మధ్య సాంగ్స్ ని జనాలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారో.. ఏం చూసి హిట్ చేస్తున్నారో చెప్పాడు. ‘మొబైల్స్ వచ్చాక సోషల్ మీడియా వాడకం పెరిగి.. అందరూ రీల్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అందుకే ఇప్పుడు సాంగ్స్ హిట్టయ్యాయా లేదా అనేది రీల్స్ లో వైరల్ అయ్యే సిగ్నేచర్ స్టెప్స్ తో డిసైడ్ చేస్తున్నారు. సిగ్నేచర్ స్టెప్స్ నచ్చాయంటే.. అది రీల్స్ చేసి.. దాని ప్రకారం సాంగ్స్ ని హిట్ చేస్తున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు ఏ సాంగ్ చేసినా సిగ్నేచర్ స్టెప్స్ అనేవి ఉండేలా చూసుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చాడు. మరి శేఖర్ మాస్టర్ చెప్పిన రీల్స్ ట్రెండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.