సినీ ఇండస్ట్రీలో తాను చేయబోయే పాత్రకోసం ఎంత రిస్క్ అయినా చేసే విలక్షణ నటులలో చియాన్ విక్రమ్ ఒకరు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్న విక్రమ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. విక్రమ్ చేసే ప్రతి సినిమా తెలుగులో డబ్ అయి రిలీజ్ అవుతుందంటే.. విక్రమ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే.. విలక్షణ నటుడిగా విక్రమ్ తన ప్రతి సినిమాతో ఎదుగుతూ వచ్చాడు.
సినిమాకోసం విక్రమ్ ఎంతవరకైనా వెళ్తాడు అనేందుకు అపరిచితుడు, ఐ సినిమాలే నిదర్శనం. ఇటీవల తన కొడుకు ధృవ్ తో కలిసి మహాన్ సినిమా చేశాడు. ఓటిటిలో విడుదలైన మహాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే విక్రమ్ నటించిన కోబ్రా సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. అదే విధంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో విక్రమ్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు.
ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమాను లైనప్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయనున్నాడట. దీనికి సంబంధించి ఇటీవలే చర్చలు కూడా జరిగాయని.. మురుగదాస్ చెప్పిన ఇంటరెస్టింగ్ లైన్ కి విక్రమ్ వెంటనే ఓకే చెప్పాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ కాంబోలో మూవీ నిర్మించనున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక దర్బార్ సినిమా తర్వాత మురుగదాస్ నుండి ఏ సినిమా రాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.