Chiyaan Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులనుంచి చిత్ర బృందం అన్ని చోట్లా ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా గడిపింది. తాజాగా, తెలుగు మీడియాకు ‘కోబ్రా’ బృందం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్పందించిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ థంబ్ నేల్స్ చూసి తను ఐదు రోజులు ఐసీయూలో ఉన్నట్లు వ్యంగ్యంగా అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ అప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాలేదు. అది నిజమే.. కానీ, నా ఆరోగ్యంపై వచ్చిన న్యూస్ చూసిన తర్వాత అప్పుడు ఆరోగ్యం దెబ్బతింది. అక్కడ కూడా పర్వాలేదు. హిందీలో రెండు, మూడు చూశాను. పిశ్చర్‌కు మాల పెట్టి.. జూనియర్ ఎన్టీఆర్.. వేరే ఎవరో ఏడుస్తున్నారు. నాకే ఏమీ అర్థంకాలేదు. డాక్టర్ గారిని ‘ ఏంటండి.. నేను ఆరోగ్యంగానే ఉన్నానుకదా’ అని అడిగాను. ఆ థంబ్ నేల్స్ చూసిన తర్వాత నేను 5 రోజులు ఐసీయూలో ఉన్నాను’’ అని నవ్వేశారు.
కాగా, కోబ్రా సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఎస్‌ఎస్ లలిత్ కుమార్, 7 స్క్రీన్ స్టూడియోస్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ ఓ కీలక పాత్ర చేశారు. ఇక కోబ్రాలో విక్రమ్ పది పాత్రల్లో కనిపిస్తారు. ఓ లెక్కల టీచర్‌కు గెటప్స్‌కు సంబంధం ఏంటి అన్నదే ప్రధానాంశం. మరి, తన ఆరోగ్యంపై వచ్చిన కొన్ని యూట్యూబ్ థంబ్ నేల్స్ పై విక్రమ్ ఆవేదన వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anchor Suma: తన పెళ్లిచీర ఖరీదు ఎంతో చెప్పేసిన యాంకర్ సుమ