Chitti Babu: హీరో విశ్వక్ సేన్ వర్సెస్ యాంకర్ దేవీ నాగవల్లిల వివాదంలో విశ్వక్‌సేన్‌కు మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్‌తో పాటు మిగితవారు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో విశ్వక్‌ది ఏ తప్పులేదనే నెటిజన్లు నమ్ముతున్నారు. గొడవ జరిగినపుడు స్టూడియోలో డిబేట్లో ఉన్న సినిమా నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సైతం విశ్వక్‌సేన్‌ది మాత్రమే తప్పు అనటాన్ని తప్పుబడుతున్నారు. విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదన్నారు.
చిన్న సినిమాను బతికించుకోవటానికి ప్రమోషన్ ఎంతో అవసరం అని, ఆ నేపథ్యంలోనే ఫ్రాంక్ వీడియో తీశారని అన్నారు. బయటకు వచ్చిన వీడియా కాకుండా స్టూడియోలో అసలు ఏం జరిగిందో స్పష్టంగా వివరించారు. జరిగినదాంట్లో విశ్వక్ సేన్, దేవీ నాగవల్లిల ఇద్దరి తప్పు ఉందని అన్నారు. మరి, చిట్టిబాబు ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vishwak Sen: తన విషయంలో జరుగుతున్న చర్చపై మోకాళ్లపై కూర్చుని విశ్వక్ సేన్ ఎమోషనల్!