మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ విషయంలో బాస్ అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి ఒక డ్యూయెట్ సాంగ్ కి సంబంధించి వీడియోను విడుదల చేసి దిల్ ఖుష్ చేసిన బాసు.. మరోసారి దిల్ ఖుష్ అయ్యే విధంగా బాస్ పార్టీ పాటకి స్టెప్పులేశారు. బాస్ పార్టీ లిరికల్ సాంగ్ కి లైవ్ లో ఫస్ట్ టైం టీమ్ తో కలిసి స్టెప్పులేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాట పాడుతుంటే.. వెనక నుంచి చిరంజీవి, దర్శకుడు బాబీ, నిర్మాతలు కోరస్ ఇస్తున్నారు. వీళ్ళతో పాటు సుకుమార్ కూడా ఉండడం విశేషం. ఆయన కూడా సాంగ్ బీట్స్ కి తగ్గేదేలే అన్నట్టు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
టీమ్ తో కలిసి చిరంజీవి చేసిన స్టెప్పులని రికార్డ్ చేసి ట్విట్టర్ లో రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ వారు. వీడియోలో చిరంజీవి రచ్చ రచ్చ చేశారు. డీజే వీరయ్య అంటూ లాస్ట్ లో చిరు భీభత్సం చేశారు. ఈ వీడియోలో చిరు వేసిన స్టెప్పులు, ఆ సాంగ్ వింటుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. శాంపిల్ వీడియోనే ఇలా ఉంటే.. పెద్ద స్క్రీన్ మీద బాస్ ఫుల్ సాంగ్ లో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ.. మీరు కూడా మీ గ్యాంగ్ తో బాస్ పార్టీ పాటకు స్టెప్పులేస్తూ వీడియోని షేర్ చేయండి అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. మరి సాంగ్ నచ్చితే.. మీరు కూడా మీ గ్యాంగ్ తో కలిసి పుంగి బజాయించండి మావా బ్రోస్.