GodFather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘లూసిఫర్‘ ఆధారంగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా చిరంజీవి పోస్టర్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ సరికొత్త లుక్ చూసి మెగాఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్ మాఫియా డాన్ గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినట్లు సమాచారం. నయనతార మెగాస్టార్ చెల్లిగా కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కొణిదెల బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. మరి గాడ్ ఫాదర్ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Mega🌟 @KChiruTweets is here as #GodFather to rule FOREVER 🔥🔥#GodFatherFirstLook out now 💥💥
– https://t.co/rjEK9b3jg7@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan @ProducerNVP @SuperGoodFilms_ @KonidelaPro @saregamasouth pic.twitter.com/P4gbVPoPQ8
— Konidela Pro Company (@KonidelaPro) July 4, 2022