టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగానే మెుదలైంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా తాజాగా శుక్రవారం(జనవరి 13)న థియేటర్లలోకి వచ్చింది. గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న మాస్ మసాలా చిత్రం కావడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా దుమ్మురేపింది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు ప్రారంభం అయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది వాల్తేరు వీరయ్య. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇక మెగాస్టార్ నటించిన సినిమాని చూడటానికి థియేటర్ కు వచ్చారు చిరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ. వారి పిల్లలతో సహా థియేటర్లో సందడి చేశారు.
‘వాల్తేరు వీరయ్య’.. మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ. డైరెక్టర్ కె. బాబీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్ల వద్ద మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే ఉదయం నాలుగు గంటల నుంచే షోలు ప్రారంభం అయిన నేపథ్యంలో థియేటర్లో సందడి చేశారు మెగా డాటర్స్ సుస్మితా, శ్రీజ. వారితో పాటుగా వారి పిల్లలు సైతం సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చోని చూశారు. వారితో పాటుగా డైరెక్టర్ బాబీ, మరో డైరెక్టర్ మెహర్ రమేష్ తో పాటుగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆ థియేటర్లో సందడి చేశారు. మెగాస్టార్ కూతుర్లు థియేటర్ కి రావడంతో అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. కొందరైతే డైరెక్టర్ బాబీని ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.