మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు. వరుసగా సినిమాలు చేస్తూ.. తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? తన సూపర్ హిట్ పాటను తనే రీమిక్స్ చేసుకోనున్నారు అంట మెగాస్టార్ చిరంజీవి.
గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సాంగ్స్ ను మెగా ఫ్యామిలీ హీరోలు అయిన రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లు రీమిక్స్ చేసి అలరించారు. తాజాగా అమిగోస్ సినిమాలో నందరమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ అయిన ‘ఎన్నోరాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నలమ్మ’ సాంగ్ ను రీమిక్స్ చేశారు కళ్యాణ్ రామ్. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? తన సూపర్ హిట్ పాటను తనే రీమిక్స్ చేసుకోనున్నారు అంట మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు. ఇక రాజకీయాల నుంచి బయటకి వచ్చిన తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు మెగాస్టార్. ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. వరుసగా ఖైదీ నెం. 150, సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ తమిళ చిత్రం అయిన ‘వేదాళం’ మూవీని తెలుగులో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే భోళా శంకర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏంటంటే? మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ సాంగ్ ను మెగాస్టారే రీమిక్స్ చేసుకుంటున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘రామా చిలకమ్మ’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదే సాంగ్ ను మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారట. చూడాలని ఉంది సినిమాకు మ్యూజిక్ అందించిన మణిశర్మ కుమారుడే, మహతి స్వరసాగర్ భోళా శంకర్ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నాడు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన కోల్ కత్తా సెట్ లో భోళా శంకర్ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే నిజానికి ఈ పాటను పాత పాటే అనుకున్నారట సినిమా యూనిట్. పాత పాటకే చిరు స్టెప్పులు వేస్తున్నారని అనుకున్నారట. ఈ క్రమంలోనే అసలు విషయం తెలిసి కంగుతిన్నారట చిత్ర యూనిట్. మహతి స్వరసాగర్ రామా చిలకమ్మ పాటను రీమిక్స్ చేసి చిరుకు వినిపించారట. దాంతో ఈ పాట విని ఇంప్రెస్ అయిన చిరంజీవి ఇదే పాటను రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సింది. ఇదే నిజమైతే మరోసారి మెగాస్టార్ గ్రేస్ డ్యాన్స్ ను మనం థియేటర్లలో చూడొచ్చు. వాల్తేరు వీరయ్యలో తన డ్యాన్స్ లో గ్రేస్ ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించారు మెగాస్టార్. మరి రామా చిలకమ్మ పాటను మెగాస్టార్ రీమిక్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.