Unstoppable Season 2: నందమూరి నట సింహం బాలక్రిష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి ఓటీటీ టాక్ షో ‘‘ అన్‌స్టాపబుల్’. ఈ టాక్ షో మొదటి సీజన్‌ను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. నిజానికి ఇంతక ముందెన్నడూ చూడని బాలక్రిష్ణను ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో ప్రేక్షకులు తెరపై చూశారు. ఆయన తన దైన స్టైల్లో ఆ షోను సూపర్ హిట్ చేశారు. అటు వచ్చిన గెస్ట్‌లను ఇటు ప్రేక్షకులను అందర్నీ తృప్తి పరిచారు. సింగిల్ హ్యాండ్‌తో సీజన్ 1ను విజయ తీరాలకు తీసుకెళ్లారు. ఇక, అతి త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి సీజన్‌ను మించి సీజన్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 2 నెవర్‌బిఫోర్ కాంబినేషన్‌లతో సాగనున్నట్లు సమాచారం. రానున్న సీజన్‌లో ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
కొంతమంది స్టార్ హీరోల పేర్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చిరంజీవి, బాలక్రిష్ణ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ఒకే వేధికపై కనిపించినా.. అది కూడా కొద్ది సేపు మాత్రమే.. అలాంటిది బాలక్రిష్ణ షోకు చిరంజీవి గెస్టుగా వస్తున్నారనే వార్త టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఒకవేళ అదే గనుక నిజం అయితే చిరంజీవి, బాలక్రిష్ణ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు.
ఇక సగటు ప్రేక్షకుడు కూడా ఆ కాంబినేషన్‌ను ఎంతో ఆస్వాధిస్తాడనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2కు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే గనుక నిజమై.. ఒకే వేధికపై బాబాయ్- అబ్బాయిలు కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు ఓ పండుగే. మరి, బాలక్రిష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 2కు గెస్టులుగా చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌లు అన్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karate Kalyani: పెళ్లిపై కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్.. ‘‘నా అందాల రారాజు కోసం ఎదురు చూస్తున్నాను’’