ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం హీరో చిరంజీవిది. ఇండస్ట్రీలో మెగస్టార్ గా ఎదిగినప్పటికి.. ఆ కీర్తి కిరిటాలను తలకు ధరించలేదు. తన చుట్టూ ఉండే వారిని నవ్వుతూ పలకరిస్తారు. సాయం అని చేయి చాస్తే.. ఆయనకు తోచిన మేర ఆదుకుంటారు. ఇక చిరంజీవి ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. తాజాగా మెగస్టార్ గొప్పతనాన్ని చాటే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం చిరంజీవికి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత ఆయన తన భార్య సురేఖతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. దానిలో భాగంగా కేరళలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చిరంజీవి శబరిమల వెళ్లి.. తన ఇష్టదైవం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. చిరంజీవి డోలీలో ప్రయాణించారు. ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత.. తనను డోలీలో మోసిన శ్రామికులకు చేతులెత్తి నమస్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇది కూడా చదవండి : సీఎంతో భేటీ.. చిరంజీవిపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక చిరంజీవి-సురేఖ దంపతులు సోమవారం ఉదయం గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిరంజీవి, ఆయన కుమారుడికి అయ్యప్ప స్వామి పట్ల విశ్వాసం ఎక్కువ. రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించే సంగతి తెలిసిందే. ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.