ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ గంగా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ గిరికుమార్ అనే వ్యక్తి.. తన పెంపుడు జంతువులను వదిలి రాలేనని.. అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్ గిరికుమార్ కోసం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గిరికుమార్ జంతుదయ తనను కదిలించిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: అమ్మ పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
‘‘డియర్ డాక్టర్ గిరికుమార్ పాటిల్.. నన్ను స్ఫూర్తిగా తీసుకుని. మీరు జాగ్వర్, పాంథర్‌లను పెంచుకుంటున్నట్లు నాకు తెలిసింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో భయానక పరిస్థితులు తలెత్తాయి. అయినా కూడా నీవు వాటి సంరక్షణను వదల్లేక.. అక్కడే ఉండిపోయావని తెలిసి నా హృదయం ద్రవిస్తోంది. మూగజీవాల పట్ల నువ్వు చూపిస్తోన్న ప్రేమ, ఆదరణ ప్రశంసనీయం. ఈ కష్టకాలంలో నువ్వు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. యుద్ధం త్వరంగా ముగిసిపోయి.. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: వైరలవుతోన్న ఫోటో.. ‘అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు’
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరికుమార్ కొన్నేళ్ల క్రితం మెడిసిన్ చదువుకునేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. కోర్సు పూర్తైన తర్వాత అక్కడే ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఇక గిరికుమార్ కు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొంది కొన్నేళ్ల క్రితం బ్లాక్ పాంథర్, జాగ్వర్‌లను కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. వాటిని వదిలి రాలేనని అంటున్నాడు. ఇప్పుడు తన కోసం చిరంజీవి ట్వీట్ చేయడంతో మరోసారి గిరికుమార్ పేరు వార్తల్లో నిలిచింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TeluguDoctor #UkraineWar #Jaguar #Panther #compassion #petlovers https://t.co/XqyUT6ebbN pic.twitter.com/balOzxRj26
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2022
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయడంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.