హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. చిరంజీవి అని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు అంటూ రోషన్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే సరదాగా అన్నారు. ఆదివారం జరిగిన పెళ్లి సందD సినిమా ప్రీరిలీజ్ ఫంక‌్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవిని పెళ్లిసందD హీరో రోషన్ చిరంజీవి గారు అని సంభోదించాడు.
చిరు మాట్లాడే సమయంలో ‘రోషన్ నన్ను చిరంజీవి గారు అని పేరుపెట్టి పిలిచాడు. ఎంత ధైర్యం ఇతని అని అనుకున్నాను. పెద్దనాన్న అని ఆపాయ్యంగా పిలిచే రోషన్ అలా పిలవడం తనకు నచ్చలేదని’ చిరు అన్నారు. ఎంతమందిలో ఉన్నా మీ నాన్నకు నేను అన్నను, నీకు పెద్దనాన్నను రా రోషన్ అంటూ రోషన్‌ను దగ్గరికి తీసుకున్నారు. దీంతో రోషన్ ఫేస్ కళకళలాడిపోయింది. వాస్తవానికి శ్రీకాంత్ ఎప్పుడూ చిరంజీవిని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటారు. అలాగే ఆయన పిల్లలు చిరంజీవిని చిన్నప్పటి నుంచి పెద్దనాన్న అని పిలుస్తుంటారు.