మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనో చరిత్ర. చాలా సామాన్య కుటుంబంలలో జన్మించి.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. సినీ పరిశ్రమలో రాణించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఆయనే ఆదర్శం. ఆయితే నేడు చిరంజీవి అనుభవిస్తున్న క్రేజ్, మెగాస్టార్ రేంజ్ ఆయనకు ఊరికే రాలేదు. దాని వెనక ఎంతో కష్టం, శ్రమ దాగున్నాయ్. ఎంతో కృషి, పట్టుదలతో శ్రమిస్తే.. నేడు ఆయన ఈ రేంజ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారితో పాటు.. ఉన్నవారికి కూడా ఆయన జీవితం ఆదర్శం. సినిమా షూటింగ్ అంటే తనకు ఎంత బాధ్యతో తెలిపే ఓ సంఘటన గురించి వివరించారు చిరంజీవి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Koratala Siva: కొరటాల శివ దెబ్బకి భయపడుతున్న Jr.NTR ఫ్యాన్స్!
కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ యూసఫ్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికోత్సవం కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి వివరించారు. ‘‘నేను జగదేకవీరుడు అతిలోకసుందరి చేస్తున్నప్పుడు 103 జ్వరంతో బాధపడుతున్నాను. అప్పుడు శ్రీదేవితో కలిసి డ్యాన్స్ చేయాలి. అలా బాధపడుతూనే డ్యాన్స్ చేశా.. షూటింగ్ అనంతరం 15 రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా గాడ్ ఫాదర్ కోసం ముంబాయి, మైత్రీ మూవీస్ వారి సినిమా కోసం కోసం హైదరాబాద్ తిరగాల్సి వచ్చేది. ఈ జర్నీ వల్ల నేను డల్‌గా ఉన్నానని చెబితే ఆ రోజు షూటింగ్ ఆగిపోయేది. దాని ఎఫెక్ట్ టోటల్ టీమ్ మీద ఉంటుంది. అందుకే.. ఇలాంటి ఇబ్బందుల గురించి సామాన్యంగా బయటకు వెల్లడించను” అని చెప్పుకొచ్చారు చిరంజీవి. అంతేకాక.. తాను షూటింగ్‌కి రాకపోతే.. మిగతా ఆర్టిస్టులకు ఇబ్బందే అని.. ఒక్క రోజు గ్యాప్ వచ్చినా షూటింగ్ షెడ్యూల్ మారిపోతుంది.. దాని వల్ల నిర్మాత నష్టపోతాడు అని తెలిపారు. తానే కాక అప్పటి హీరోలందరూ ఇదే ఉద్దేశంతో పని చేసేవారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: రివ్యూలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!ఇక ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పుకొచ్చారు చిరంజీవి. నూతన్ ప్రసాద్ ఓ యాక్సిడెంట్ లో కాళ్లు పోగొట్టుకొని బాధపడుతున్న సమయంలో కూడా క్లోజప్ షాట్స్ తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా తల్లి చనిపోయి కుటుంబం అంతా విషాదంలో ఉన్న సమయంలో కూడా.. అల్లు రామలింగయ్య గారు షూటింగ్‌కి వెళ్లి ప్రేక్షకులను నవ్వించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Acharya Collections: టాక్‌కు భిన్నంగా ‘ఆచార్య’ ఫస్ట్ డే కలెక్షన్స్..