చిరంజీవికి క్యాన్సర్ అంటూ గాలి వార్తలు! ఇదేమి జర్నలిజం?

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సంబంధించి ప్రతి చిన్న వార్త నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు సెలబ్రెలపై వచ్చే పుకార్లు వారికి తలనొప్పిగా మారిన సందర్బాలు కూడా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 08:19 PM IST

ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. శనివారం నానక్‌రామ్‌గూడాలోని నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన క్యాన్సర్ వ్యాధి గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం గతంలో చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారు అంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్.. నానక్‌రామ్‌గూడాలోని నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడారు. అయితే మీడియాలో మాత్రం గతంలో తాను ఏఐజీలో కొలనోస్కాపి చేయించుకుంటే క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని.. తాను కూడా క్యాన్సర్ బారిన పడ్డానని మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంపై స్పందించారు చిరంజీవి. తాను ఎప్పుడూ క్యాన్సర్ భారిన పడలేదని.. కేవలం క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఉండాలని మాత్రమే మాట్లాడినట్లు తెలిపారు. గతంలో తాను టెస్టులు చేయించుకుంటే నెగిటీవ్ వచ్చిందని.. ముందుగా టెస్టులు చేయించుకోకుంటే క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. అందుకే 40 ఏళ్లు దాటినవారు ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకోవాలని మాత్రమే సూచించానని అన్నారు.

ఇదిలా ఉంటే.. కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. అభిమానులు బాధపడుతున్నారు. వారందరి కోసం నేను ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. పూర్తిగా విషయం గురించి తెలుసుకోకుండా.. అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ట్విట్ వైరల్ అవుతుంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed