ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ సినిమాల హావా నడుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు ఎప్పటి నుంచో కొన్ని కాంబినేషన్‌ల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాటిలో కొన్ని తెరమీద ప్రదర్శితం కాగా.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇలా అభిమానుల్లో అమితాసక్తి ఉన్న మల్టీస్టారర్ కాంబినేషన్ ఏదంటే.. మెగా స్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరిద్దరిని కలిపి తెర మీద చూడాలని మెగా అభిమానులతో పాటు.. సినీ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో తళుక్కున మెరిశారు. కొన్ని క్షణాల పాటు తెర మీద ఇద్దరు కనిపించారు. ఇలా కాకుండా ఇద్దరిని ఫుల్‌లెంగ్త్ రోల్‌లో చూడాలని అభిమానుల కోరిక. మరి వీరిద్దరు కలిసి నటించే చాన్స్ ఉందా అంటే.. ప్రస్తుతానికి అయితే లేదు. భవిష్యత్తులో చెప్పలేం.
అసలు ఇప్పుడు చిరు, పవన్‌ల మల్టీస్టారర్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఆచార్య ప్రెస్‌మీట్ వల్ల. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఆచార్య చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు.. ఒకవేళ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే? ఎలా ఉండేది అని చిరంజీవిని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: మహేశ్ బాబు- నమ్రత ఇంటికొస్తానంటే రావొద్దని చెప్పాను: చిరంజీవి
దీనికి చిరంజీవి బదులిస్తూ.. “రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్రకు ఏ హీరో అయినా న్యాయం చేయగలిగేవాడే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, రామ్ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు. నిజ జీవితంలో తండ్రీ తనయుల అనుబంధం వెండి తెరపై పాత్రలకు యాడెడ్ వేల్యూ అవుతుంది. ఇదే విషయం మొన్న కూడా చెప్పాను. ఒకవేళ చరణ్ కు ఈ పాత్ర చేయడం కుదరలేదు అనుకోండి… చరణ్ దొరకలేదు అనుకోండి… బెస్ట్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్” అని చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘ఆచార్య’కు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. టికెట్ ధరల పెంపు, రోజుకు 5 షోలు!
చరణ్ బదులు.. సిద్ధ క్యారెక్టర్‌లో పవన్ ఉన్నా తనకు సేమ్ ఫీలింగ్ వచ్చేదని చిరంజీవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ “ఒకవేళ సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే నిజ జీవితంలో మా అనుబంధం యాడెడ్ వేల్యూ అయ్యేది. చరణ్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో… ఆ పాత్రలో పవన్ చేసినా.. నాకు అదే ఫీల్ ఉంటుంది. వంద శాతం అదే ఫీలింగ్ వస్తుంది. అందులో నో డౌట్. అయితే, అంత వరకూ రాలేదనుకోండి. ఈ సినిమాకు అన్నీ కుదిరాయి” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: పార్వతి ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు!
ఇక ప్రసుత్తం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు షూటింగ్‌తో బిజీగా ఉండగా.. రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఏది ఏమైనా చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తే.. అది మెగా అభిమానులతో పాటు.. ప్రేక్షకులకు కూడా పండగే. మరి చిరు, పవన్ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.