‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. ఎన్నడు లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తమ మొదటి ఓటును వినియోగించుకున్న కళాకారులు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఓటింగ్ రాని వారు కూడా ఈసారి ఓటు వేసినట్లు చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఓటింగ్ ప్రారంభం అయిన కాసేపటికే రామ్ చరణ్‌లో కలిసి వచ్చి తన ఓటు వేశారు.
ఓటు వేసి వెళ్తూ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమంయలో ఇరు ప్యానళ్ల వారు చేసుకున్న విమర్శలపై చిరంజీవి స్పందించారు. ‘ఎన్నికల సమయంలో ఆ భావోద్వేగాల్లో ఏవో మాట్లాడతారు అవేమీ శాశ్వతం కాదు’ అంటూ చిరంజీవి సమాధాన మిచ్చారు. మీలాంటి పెద్దవారు కలిసి మాట్లాడి ఏకగ్రీవం చేయచ్చు కదా? అని ప్రశ్నించగా.. ‘కొన్నిసార్లు ఎన్నికల్లు అనివార్యమైనప్పుడు అందరూ దాన్ని ఆమోదించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరగడం అప్రజాస్వామికం కాదు కదా?’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.