కృషి, పట్టుదల ఉంటే.. అనుకున్న రంగంలో విజయం సాధించవచ్చు.. ఎంతో గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. చిత్రపరిశ్రమలాంటి రంగుల లోకంలో.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. అంచెలంచెలుగా ఎదుగుతూ… మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే ప్రతి ఒక్కరికి.. చిరంజీవి ఆదర్శం. 60 పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా.. వరుస సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా.. మంగళవారం రాత్రి చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి.. చిరంజీవిని ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ‘‘కెరీర్ ప్రారంభంలో ఇమేజ్ కోసం నటులు.. రిస్క్ చేస్తూ కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. అలానే మీరు కూడా గూండా సినిమాలో అలాంటి రిస్క్ చేశారు. ఆ తర్వాత మీకంటూ ఓ ఇమేజీ సంపాదించుకున్న తర్వాత కూడా.. అప్పట్లో వచ్చిన బావగారు బాగున్నారా మూవీలో బంగీ జంప్ చేశారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగారు. మీరు ఈ మూవీ కోసం -8 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశారు.. వర్షంలో తడస్తూ సీన్స్ చేశారు.. ఇప్పుడు కూడా మీరు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా’’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి స్పందిస్తూ.. చిరంజీవి కాస్త ఎమోషనల్ అయ్యారు ‘‘రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. అలా తీసుకోలేని రోజున బెటర్ రిటైర్.. ఇంటికెళ్లిపో. ఈ మాట ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ చెప్తాను’’ అని చిరంజీవి.. చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
‘‘పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. నువ్వు కమిట్ అయినప్పుడు.. పాత్రకి న్యాయం చేయాలని అనుకున్నప్పుడు.. అక్కడ ఉన్న ఇబ్బందుల్ని నువ్వు ఇబ్బందిగా ఫీలవకూడదు. పడ్డా.. వాటిని కనబడనీయకూడదు. వాటికి తలొగ్గి చేయాల్సిందే. అలా చేసినప్పుడే.. నీకు ఇండస్ట్రీలో ఉండే అర్హత ఉంది.. లేదు చేయలేను అంటావా.. బెటర్ నువ్వు రిటైర్ అవ్వు.. ఇంటికి వెళ్లు. ఒక యాక్టర్‌గా నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్టార్‌డమ్.. ఊరికే రాలేదు. రిస్క్ చెయ్యాలి అని మీరే అంటారు. నటుడు అంటే.. వేషాలపై ఆకలితో ఉండాలి.. అది కూడా అర్ధాకలి. ఇంకా ఇంకా పాత్రలు రావాలని కోరుకోవాలి. ఒకవేళ ఆ ఆకలి చచ్చిపోయింది అంటే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవచ్చు. ఇది నాకే కాదు.. ఎవరికైనా వర్తిస్తుంది’’ అన్నారు చిరంజీవి
‘‘ఈ సినిమాలో సాంగ్ కోసం -8 డిగ్రీ చలిలో షర్ట్ విప్పేసి చేశాను. అప్పడు ఇబ్బంది అనిపించినా సరే.. నేను కమిట్ అయిన పాత్ర కోసం చేయాల్సిందే.. చేశాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి.. నా బాధలు నేను పడ్డాను. అయితే షూటింగ్ సమయంలో నేను ఇబ్బంది పడుతున్నట్లు.. బయటకు వ్యక్త పరచను. గొడ్డులాగా కష్టపడతాను. ఆ సీన్స్ చేసేటప్పుడు నాకు బాధ అనిపించదు. ఎందుకంటే తెరపై నన్ను చూసినప్పుడు అభిమానుల ఎలా స్పందిస్తారో తలుచుకుంటాను.. అప్పుడు రియాక్షన్‌ని.. నన్ను చూసి వారు కొట్టే.. చప్పట్లని గుర్తు తెచ్చుకుంటాను. వెంటనే చీర్ అప్ అవుతాను’’ అని తెలిపారు. ఇక వాల్తేర్ వీరయ్య చిత్రం.. ఇదే టైటిల్‌తో.. జనవరి 13న హిందీలో కూడా విడుదల కాబోతుంది. మరి చిరంజీవి చేసిన సూచన సరైందే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.