చిత్రసీమలో హాస్యబ్రహ్మగా పేరొందిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం. దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. పన్నెండు వందలకు పైగా సినిమాలలో నటించి.. గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కెరీర్ లో ఎన్నో వందల వెరైటీ క్యారెక్టర్స్ పోషించిన బ్రహ్మానందం.. తెలుగు మనిషి కావడం తెలుగువారంతా ఎంతో గర్వించదగిన విషయం. తాజాగా రంగమార్తాండ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ బ్రహ్మానందం క్యారెక్టర్ చూసి ఎమోషనల్ అవుతున్నారు
తెలుగు చిత్రసీమలో హాస్యబ్రహ్మగా పేరొందిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం. దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. పన్నెండు వందలకు పైగా సినిమాలలో నటించి.. గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కెరీర్ లో ఎన్నో వందల వెరైటీ క్యారెక్టర్స్ పోషించిన బ్రహ్మానందం.. తెలుగు మనిషి కావడం తెలుగువారంతా ఎంతో గర్వించదగిన విషయం. 37 ఏళ్ళ క్రితం.. ‘చంటబ్బాయ్’ సినిమాతో నటుడిగా కెరీర్ ఆరంభించిన బ్రహ్మానందం.. దేశమంతా తెలుగు ఇండస్ట్రీవైపు తొంగిచూసేలా చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో బ్రహ్మితో సినిమాలు చేయని హీరోలు, హీరోయిన్స్ లేరు.
ఎలాంటి పాత్రకైనా ఇట్టే ప్రాణం పోయగల బ్రహ్మానందం.. కొన్నేళ్లుగా రెగ్యులర్ కామెడీ రోల్స్ చేసుకుంటూ పోతున్నారు. ఆయన్ని ఛాలెంజింగ్ గా చూపించే క్యారెక్టర్స్.. ఆయన్ని కొత్తగా చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఇన్నాళ్లు నిరాశే మిగిలింది. కానీ.. తాజాగా రంగమార్తాండ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ బ్రహ్మానందాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. రంగమార్తాండ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్రహ్మానందం క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిపోయి.. రియాక్ట్ అవుతున్నారంటే మామూలు విషయం కాదు. 67 ఏళ్ళ వయసులో చేస్తున్న పాత్రల పట్ల ఆయనకున్న డెడికేషన్.. ప్రతిభ చూసి తోటి నటీనటులు మంత్రముగ్ధులు అవుతున్నారు.
కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందంతో పాటు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి మంచి పేరు, గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి గొప్పగా మాట్లాడుతూ.. ఎంతోమంది ఇండస్ట్రీ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ.. ఆయన్ని శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం చిరు, చరణ్.. బ్రహ్మిని సత్కరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం నటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Megastar @KChiruTweets & Global Star @AlwaysRamCharan clicked, as they congratulate Dr. #Brahmanandam garu on his spectacular performance in the recent hit film #Rangamarthanda 👏👏#RamCharan #Chiranjeevi #GlobalStarRamCharan #ManOfMassesRamCharan #ManOfMassesBdayMonth pic.twitter.com/gHBXOU5UhQ
— SivaCherry (@sivacherry9) March 23, 2023