పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎప్పుడో ఎవరో చెబితే తప్పితే అవి బయటకు రావు. మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా ఓ టాక్ షోలో పవన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని రివీల్ చేశారు.
సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని అభిమానులకు కచ్చితంగా ఉంటుంది. అందుకోసమే అన్నట్లు ఈ మధ్య టాక్ షోలు బాగా పాపులర్ అవుతున్నాయి. బాలయ్య ‘అన్ స్టాపబుల్’.. ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా మరో టాక్ షో రెడీ అయింది. అదే సింగర్ స్మిత హోస్ట్ గా చేస్తున్న ‘నిజం విత్ స్మిత’. ప్రోమోతోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ షోకు తొలి గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఏం చెబుతారా ఏం చెబుతారా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కోసం అదిరిపోయే విషయాల్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఇవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ అనగానే ఆ లిస్టులో కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాప్ లో ఉంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్ గా ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్నారు. వారం క్రితం తొలి ఎపిసోడ్, తాజాగా రెండో ఎపిసోడ్.. ప్రేక్షకుల్ని తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే మెగాస్టార్ చిరంజీవి మరో టాక్ షోకు తొలి గెస్టుగా వచ్చారు. తన గురించి కంటే తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాల్ని షేర్ చేసుకున్నారు. అవి కాస్త వైరల్ గా మారాయి.
పవన్ కల్యాణ్.. ఓ పొలిటిషన్ లేదా యాక్టర్ గా రెండింటిలో మీకు ఏదంటే ఇష్టం? అని హోస్ట్ స్మిత అడగ్గా.. దానికి బదులిస్తూ… ‘పవన్ కల్యాణ్ సహజంగా.. తన నేచర్ ని బట్టి ఏదో ఓ రోజు కచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. ప్రజల బాధలకు రెస్పాండ్ కావడం, ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచీ ఉంది. ఒకానొక టైంలో నక్సల్స్ లోకి వెళ్లిపోతాడేమోనని భయమేసింది. ఎందుకంటే.. గన్ లతో ఎక్కువగా ఆడుకునేవాడు. షూటింగ్స్ కోసం నేను సింగపూర్ వెళ్తే.. ‘అన్నయ్య అక్కడ గన్స్ దొరుకుతాయి తీసుకురా’ అనేవాడు. అవి డమ్మీ గన్సే కానీ సెమీ ఆటోమేటిక్. అలా గన్స్ తో తిరుగుతుంటే ఓసారి రైల్వే స్టేషన్ లో ఆపేశారు. డమ్మీ గన్ అని తెలిసి వదిలేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ అని భక్తులు అనాలి. కాబట్టి నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన అవసరం ఉంది.’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. మరి పవన్ గురించి చిరు చెప్పిన విషయాలు విన్న తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Guns and Roses..The OG @PawanKalyan 🦁🔥 pic.twitter.com/OTPHo5f1iX
— Nithin (@NithinPSPKCult) February 10, 2023