మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలో సినిమా కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి, ఉపాధి లేక తీవ్ర నష్టాన్ని అన్నివర్గాల వారు చవిచూసారు. ఈ నేపథ్యంలో సినిమా కార్మికుల కష్టాలను తీర్చడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. పేర్ని నాని, ప్రస్తుత సమస్య సీఎంకు వివరించాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో చిరు ఇంట సినీ పముఖుల సందడి వాతావరణం కనిపించింది. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు. గతంలో సీఎం జగన్ తో భేటీలో చిరంజీవి నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు బృందం సమస్యలు విన్నవించగా సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
సినీ, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్,బీ,సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై వారు చర్చించారు. ఈ భేటీలో థియేటర్ల సమస్య గురించి ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బతుకు తెరువు, పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ చర్చలకు చిరంజీవి, సినీ పరిశ్రమకు చెందిన కొందరు సినీ పెద్దలు హాజరు కానున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది. సీఎం జగన్ ఈసారి సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తారనే అంతా ఆకాంక్షిస్తున్నారు.
కరోనావేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనా ఏపీలో టిక్కెట్టు ధర సమస్యాత్మకం అయిన సంగతి తెలిసిందే. సవరించిన ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి. థియేటర్ల సమస్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. అన్ని కుదిరితే ముఖ్యమంత్రితో భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది. సీఎం జగన్ ఈసారి సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తారనే అంతా ఆకాంక్షిస్తున్నారు.