Naralashetty Gangadhar: చిరంజీవి మేనేజర్ నరాలశెట్టి గంగాధర్ తల్లి సత్యవతి కొద్దిరోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల వయసులో మెమొరీ లాస్ కారణంగా బాధపడుతున్న ఆమె వారం క్రితం అర్థరాత్రి సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి కనిపించలేదు. ఈ నేపథ్యంలో గంగాధర్ మీడియాను ఆశ్రయించారు. తల్లితో తాను దిగిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు. తన తల్లి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తనకు ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, తాజాగా అందించిన సమాచారం మేరకు.. గంగాధర్ తల్లి సత్యవతి కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
సత్యవతి మరణంపై శివ చెర్రీ తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘ సోదరుడు నరాల శెట్టి గంగాధర్ తల్లి సత్యవతి గారు ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు. అమ్మా! నీ ఆత్మకు శాంతి కలుగుగాక.. గాంగాధర్ అన్న ధైర్యంగా ఉండూ’’ అని పేర్కొన్నాడు. కాగా, గంగాధర్.. చిరంజీవి అభిమానిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో తన అభిమాన హీరో చిరంజీవికే మేనేజర్ అయ్యారు. చాలా ఏళ్లుగా చిరు దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
Our Beloved Brother @NsGangadhar1 garu’s Mother ( SatyaVathi Garu ) Left the World .
Rest In Peace Amma Garu 💐💐💐💐💐
Stay Strong Gangadhar Anna pic.twitter.com/B3PCtQU8AX— SivaCherry (@sivacherry9) October 15, 2022