మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దర్శకుడు కొరటాల శివతో ఆచార్య వంటి సినిమాల్లో నటించి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టుకున్నాడు మెగాస్టార్. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి సినిమా థియేటర్ల ఓపెన్‌కు అవకాశమివ్వటంతో థియేటర్ల ఓపెన్ అయి చిత్రాలు సైతం విడుదలవుతున్నాయి.
ఇక్కడ మరో అంశం ఏంటంటే..? సినిమా ఇండస్ట్రీల హీరోలతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారని గత కొంత కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల నిర్ణయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నారట. తన మంత్రుల వల్ల కాకపోవటంతో ఏకంగా బడా సినీ తారలతో చర్చించేందుకు అడుగులు వేస్తున్నట్లు ఓ వర్గం మీడియా నేతలు చెబుతున్నారు.
అయితే గతంలో ఇదే అంశం చర్చించటానికి నాగ్, చిరు, రాజమౌళి, సురేష్ బాబు వంటి కొందరు నటులు వెళ్లారు. దీంతో వారు వెళ్లటంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సారి జగన్ అపాయింట్‌మెంట్‌లో మాత్రం ఇద్దరు ముగ్గురు హీరోలకు మాత్రమే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇద్దరు కూడా ఉన్నారట. మరి ఇందులో వాస్తవం ఎంత? ఎవరెవరు వెళ్లనున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.