ట్రైలర్ చివర్లో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేయడం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ట్రైలర్‌లో చిరు, పవన్‌తో పాటు మరో హీరోని కూడా ఇమిటేట్ చేశారు.
ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘భోళా శంకర్’ మరి కొద్ది రోజుల్లో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘సైరా’ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి చిరుతో జతకడుతుండగా.. కీర్తి సురేష్, చిరు చెల్లెలుగా, సుశాంత్ ఆమె ప్రియుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైంది.
‘పబ్లిక్ ప్రాబ్లమ్ వస్తే పోలీసుల దగ్గరకొస్తారు.. అదే పోలీసులకు ప్రాబ్లమ్ వస్తే భోళా భాయ్ దగ్గరకు వస్తారు’ అనే డైలాగ్ చిరు క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతుందో తెలియజేస్తుంది. ‘నీ వెనుక మాఫియా ఉంటే.. నా వెనుక దునియా ఉంది’.. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ చివర్లో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేయడం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ట్రైలర్‌లో చిరు, పవన్‌తో పాటు మరో హీరోని కూడా ఇమిటేట్ చేశారు. ఆ హీరో ఎవరో కాదు. యాంగ్రీ స్టార్ డా.రాజ శేఖర్.
ఇది కూడా చదవండి : ‘రంగస్థలం’లో రామ్ చరణ్ బాబులా!.. ‘భోళా శంకర్’ ట్రైలర్ అదిరింది..
సాధారణంగా ఇతర సీనియర్, యంగ్ హీరోలు తమ సినిమాల్లో చిరు రిఫరెన్స్ తీసుకోవడం, ఆయణ్ణి ఇమిటేట్ చేయడం వంటివి చేస్తుంటారు. అలాంటిది మెగాస్టార్ పవన్, రాజ శేఖర్‌లను అచ్చుగుద్దినట్టు దింపడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ భలే సర్‌ప్రైజ్ ఫీలవుతున్నారు. ఇంతకుముందు ‘గబ్బర్ సింగ్’ లోనూ పవర్ స్టార్, రాజ శేఖర్‌ని ఇమిటేట్ చేసి ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు అన్నయ్య కూడా అనుకరించడం విశేషం. ప్రస్తుతం ట్రైలర్‌లోని ఈ స్క్రీన్ షాట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. భారీ అంచనాల మధ్య ‘భోళా శంకర్’ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Happy to Release the Trailer of #BholaaShankar 🔱
Our Mega Star @KChiruTweets in his best forte in @MeherRamesh Stylish Mass Presentation!!https://t.co/owc7sByWKr
Can’t wait to witness his energy on the big screen on August 11th 🔥
Best wishes to the entire team 😊… pic.twitter.com/82IUn2tBW6
— Ram Charan (@AlwaysRamCharan) July 27, 2023