మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సినిమా కెరీర్ మొదలైన నాటి నుంచి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. వందల సంఖ్యలో డబ్బు సహాయాలు చేశారు. అంతకు మించి గుప్త దానాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తన అవసరం ఉందని తెలిస్తే చాలు.. సహాయం చేసేస్తున్నారు. సినిమా తన కుటుంబంగా భావించే చిరంజీవి.. సినిమా వాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అంతేకాదు! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినిమా వాళ్లను పిలిచి మరీ సహాయం చేస్తున్నారు.
తాజాగా, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఒకప్పటి కెమెరామ్యాన్‌కు మెగాస్టార్ సహాయం చేశారు. ఒకప్పుడు తన సినిమాలకు పని చేసిన దేవరాజ్ అనే కెమెరామ్యాన్‌కు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. దేవరాజ్.. చిరంజీవి నటించిన నాగు, పులి.. బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ సినిమాలకు కెమెరామ్యాన్‌గా పని చేశారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తన సినిమాలకు పని చేసిన వ్యక్తికి చిరు సహాయం అందించటం పట్ల ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా, చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక, చిరంజీవి నటిస్తున్న ‘‘భోలా శంకర్’’ షూటింగ్ శరావేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తమిళ రీమేక్‌గా తెరకెక్కనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023 మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి, మెగాస్టార్ చిరంజీవి ఒకప్పటి కెమెరామ్యాన్ దేవరాజ్‌కు ఐదు లక్షల రూపాయల సహాయం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— devipriya (@sairaaj44) February 2, 2023