తెలుగు ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చిరంజీవి ని అందరూ గౌరవించేలా చేసింది. దేశానికి రాజు అయినా.. తల్లికి మాత్రం కొడుకే అన్నట్టు దేశం మెచ్చిన హీరో అయినా చిరంజీవి తల్లికి కొడుకే. తల్లి అంజనా దేవితో చిరంజీవిది విడదీయరాని బంధం. ఇంట్లో ఉంటే మెగాస్టార్ ఎక్కువగా అమ్మతోనే గడుపుతారు. స్వయంగా అమ్మకు ఇష్టమైన వంట చేసి వడ్డిస్తారు. ఇక అంజనాదేవి పుట్టిన రోజు వస్తే మెగా కుటుంబ సభ్యుల సంబరాలు అన్నీ ఇన్నీ కావు.. అందరూ ఆమె ఆశిస్సులు తీసుకుంటారు.
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ సెలంబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. ఈ మద్య మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. నేడు అంజనాదేవి పుట్టినరోజు కాగా… ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు’’అంటూ స్పందించారు. అయితే తన పెద్ద కుమారుడు చిరంజీవిని అంజనాదేవి శంకర్ బాబు అని ముద్దుగా పిలుస్తారని చిరంజీవి ట్వీట్ తో అర్థమైంది. ప్రస్తుతం ఆయన ఇంటిలోనే ఐసోలేషన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ఈ మల్టీస్టారర్ మూడీ ఏప్రిల్ 1న విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో రీసెంట్‌గా మరో మూవీ స్టార్ట్ చేశారు. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022