తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎవరిదా అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానం ఉంటుంది. ఆయన తెరకెక్కించే సినిమాలన్నా, ఆయన డైరెక్షన్ అన్నా చాలా మందే ఇష్టపడుతుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడుతా, మురారి, రాఖీ వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఇక విషయం ఏంటంటే? డైరెక్టర్ కృష్ణవంశీతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు ఊపందుకుంటున్నాయి. గతంలో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లే సమయంలో కృష్ణవంశీ వందేమాతరం అనే కథను రాశరట. అప్పట్లో చిరు రాజకీయాల్లో కాస్త బిజీగా మారటంతో ఈ కథను పూర్తిగా పక్కనపెట్టేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల మీద సినిమాలు చేస్తుండటంతో కృష్ణవంశీ అదే కథను చిరుకి వినిపించటంతో దీనికి మెగాస్టార్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరీ నిజంగానే కృష్ణవంశీ డైరెక్షన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.