భారత చలన చిత్రం గర్వించతగ్గ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా వెండితెర మీద రారాజుగా వెలుగుతున్న మగమహారాజు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా స్వయంకృషితో మామూలు సగటు మనిషి నుండి మెగాస్టార్ గా ఎదిగిన తీరు చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది, గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, నటులు, హాస్యనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ప్రతీ కోవకి చెందిన కళాకారులు ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతీ ఒక్క వర్గానికి ఆయనొక ఇన్స్పిరేషన్. చిరంజీవిలా ఎదగాలి అని వచ్చే వారి నుంచి.. చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీకి వచ్చే వారి వరకూ ఇలా చాలా మంది ఆయన్ను ఆరాధించి వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి అన్నయ్య మీద విషప్రయోగం జరిగిందంటే ఎవరైనా నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు. ఇది 34 ఏళ్ళ క్రితం జరిగిన బాధాకరమైన సంఘటన. అప్పట్లో జాతీయ మీడియా నుండి తెలుగు మీడియా వరకూ కొన్ని పత్రికలు మాత్రమే దీని మీద కథనాలు ప్రచురించాయి.
ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండచ్చు, కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ అంశం గురించి ప్రస్తావించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. “చిరంజీవి ఫాలోయింగ్ చూసి ఓర్వలేక ఆయన మీద విషప్రయోగం చేశారట, అది నిజమేనా” అని సదరు యాంకర్ అడుగగా.. దానికి మురళీ మోహన్ ఈ విధంగా స్పందించారు. “విషప్రయోగం జరిగి ఉండచ్చునని, కానీ తనకు అంత డీటెయిల్డ్ గా తెలియదని.. ఓర్వలేనివాళ్ళు, కాంపిటీషన్ అయిపోతున్నాడని తట్టుకోలేక విషప్రయోగం చేసి ఉండవచ్చునని” మురళీ మోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మురళీ మోహన్ లాంటి వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారంటే.. ఇది జరిగే ఉంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆ జై చిరంజీవే ఈ చిరంజీవిని కాపాడారని, ఆయన ఉండగా చిరుకి ఏమీ కాదని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి మీద విష ప్రయోగం ఎలా జరిగింది?
ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ హీరోగా చిరు ఎనలేని అభిమానులని సంపాదించుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి అవుట్ డోర్ షూటింగ్ దగ్గరకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేవారు. చిరంజీవి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. ఆ సమయంలోనే చిరు అంటే గిట్టని కొంతమంది చిరంజీవి హత్యకు కుట్ర చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ‘మరణ మృదంగం’ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఆ సమయంలో అభిమానినంటూ ఓ వ్యక్తి చిరు కాళ్ళు పట్టుకున్నాడు. “ఈరోజు నా పుట్టినరోజు.. ఇక్కడ కేక్ కట్ చేస్తాను. మీరు నా దగ్గర ఉండండి’’ అని ఆ అభిమాని కోరాడు. పుట్టినరోజు నాడు తన అభిమాని అడిగాడు కాబట్టి.. చిరంజీవి కాదనకుండా ఓకే చెప్పారు. కేక్ కట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి.. చిరుని కేక్ తినమని బలవంతం చేశాడు. వద్దని చెప్పినా బలవంతంగా కేక్ ను చిరంజీవి నోట్లో కుక్కాడు. దీంతో ఎక్కడో తేడా కొడుతుందని కేక్ ను బయటకు ఊసేశారు చిరంజీవి. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో కేక్ కింద పడిపోయింది. ఆ కేక్ లో ఏవో రంగురంగుల పదార్థాలు కనిపించాయి.
వెంటనే చిరంజీవి నోరు శుభ్రం చేసుకున్నారు. ఆ తర్వాత మేకప్ సమయంలో ఆయన పెదాలు నీలి రంగులోకి మారి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. దీంతో చిరంజీవిని ఆస్పత్రిలో చేర్చారు. కేక్ లో విషం కలిపారని వైద్యులు వెల్లడించారు. విషం లోపలికి వెళ్లకుండా ఉండేలా వాంతులు అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చారు. రాత్రంతా చిరంజీవి హాస్పిటల్. రెండో రోజు అంతా ఓకే అనుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ కుట్రకు పాల్పడ్డ వ్యక్తి వివరాలు మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అసలు ఆ విషప్రయోగాన్ని చేయించిందెవరో? చిరంజీవి ఎదుగుదలను ఆపాలనుకున్నది ఎవరో అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఏది ఏమైనా ఆయన అభిమానమే ఆయనకు శ్రీరామరక్ష. ఇక అప్పటివరకూ సుప్రీమ్ హీరోగా ఉన్న చిరుకి ‘మరణ మృదంగం’ సినిమా నుంచే మెగాస్టార్ అనే బిరుదు రావడం విశేషం. మరి మన మెగాస్టార్ చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sri Reddy: పెళ్లి కాకుండానే గర్భం.. తీయించుకోలేని పరిస్థితి..! శ్రీరెడ్డి ఎమోషనల్!
ఇది కూడా చదవండి: వీడియో: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సల్మాన్ ఖాన్.. ఎందుకంటే?