ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పలు ఛానల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. ఇటీవల చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావించారు.
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి తనతో సినిమా చేస్తానని చెప్పినా తాను మాత్రం చేయనని నవ్వుతూ కామెంట్ చేశారు. అదంతా ఒక రూమర్ అని కొట్టిపడేశారు. ఆ పేరు ఆయనకు ఊరికే రాలేదు.. ఆయన డైరెక్షన్ లో హీరో అంటే అతిగా కష్టపడాల్సి ఉంటుందని చిరంజీవి తెలిపారు. అంటే ఆయన ఫిజికల్ గా ఇబ్బంది పెడతారని చెప్పకనే చెప్పారు చిరంజీవి. ఆయన ఎంచుకునే కథలు, రోల్స్ అలా ఉంటాయని.. అందుకు తగ్గట్టుగా తీర్చిదిద్దే సత్తా ఆయనకు ఉందని అన్నారు.
ఒక హీరోగా ఆయన చిత్రాలు అంటే చాలా ఇష్టపడతాను.. కానీ డైరెక్షన్ అంటే మాత్రం దూరం ఉంటాను. ఒక నటుడిగా రాజమౌళిని సంతృప్తిపరచలేనని చిరంజీవి కామెంట్లు చేశారు. ఇదే సమయంలో తన మనసులోని మాట కూడా చెప్పారు. తనకు ఎప్పటి నుంచో ఒక మూవీకి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందని.. అయితే డైరెక్షన్ ఎప్పుడు చేస్తానో చెప్పలేనని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. ఆచార్య సినిమాతో మరో సక్సెస్ సాధిస్తామని చిరంజీవి, చరణ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.